వరుసగా మూడో నెలా పెరిగిన ఎగుమతులు!

by  |
imports
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎగుమతులు ఫిబ్రవరిలో వరుసగా మూడో నెలా పెరిగాయి. 2020, ఫిబ్రవరితో పోలిస్తే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎగుమతులు 0.67 శాతం పెరిగి సుమారు రూ. 2.03 లక్షల కోట్లకు చేరాయి. అయితే, జనవరిలో 6.16 శాతం వృద్ధి కంటే గత నెల తగ్గాయి. దిగుమతులు 6.96 శాతం పెరిగి సుమారు రూ. 2.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత నెలల్లో బంగారం దిగుమతులు గతేడాది కంటే ఏకంగా 124 శాతం పెరగడం గమనార్హం. ఇది మొత్తం ఎగుమతుల్లో 7 శాతం పెరుగుదలకు దారితీసింది. అలాగే, దేశ వాణిజ్య లోటు సుమారు రూ. 92.1 వేల కోట్లకు పెరిగింది. 2020 ఇదే నెలలో వాణిజ్య లోటు రూ. 74.1 వేల కోట్లుగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం గణాంకాలను వెల్లడించింది.

* మొత్తం 30 ప్రధాన ఎగుమతుల్లో 17 ఎగుమతులు వృద్ధిని సాధించాయి. ఇందులో ఔషధాలు, కార్పెట్లు, హస్తకళలు, సిరామిక్స్, ప్లాస్టిక్, రసాయనాలు వృద్ధి సాధించగా, రెడీమేడ్ వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి.

* చమురు దిగుమతులు 16.63 శాతం క్షీణించాయి. బంగారంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇనుము, కలప ఉత్పత్తుల దిగుమతులు పెరిగాయి. యంత్ర పరికరాలు, రవాణా పరికరాలు, ప్రాజెక్ట్ వస్తువుల దిగుమతులు క్షీణించాయి.

Next Story