డిసెంబర్‌లో 39 శాతం పెరిగిన భారత ఎగుమతులు

37
Indian engineering exports

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది డిసెంబర్‌లో భారత ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 38.91 శాతం పెరిగాయని శుక్రవారం ప్రభుత్వ గణాంకాలు వెళ్లడించాయి. ఇంజనీరింగ్, టెక్స్‌టైల్స్, కెమికల్స్ వంటి రంగాల్లో మెరుగైన పనితీరు కారణంగానే ఎగుమతులు 37.81 బిలియన్ డాలర్ల(రూ. 2.80 లక్షల కోట్ల)కు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, సమీక్షించిన నెలలో వాణిజ్య లోటు 21.68 బిలియన్ డాలర్ల(రూ. 1.60 లక్షల కోట్ల)కు పెరిగింది. డిసెంబర్‌లో దిగుమతులు కూడా 38.55 శాతం పెరిగి 59.48 బిలియన్ డాలర్ల(రూ. 4.41 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎగుమతులు 49.66 శాతం పెరిగి 301.38 బిలియన్ డాలర్ల(రూ. 22.35 లక్షల కోట్ల)కు పెరిగాయి. దిగుమతులు 443.82 బిలియన్ డాలర్లు(రూ. 32.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. వాణిజ్య లోటు 142.44 బిలియన్ డాలర్లు(రూ. 10.56 లక్షల కోట్లు)గా ఉన్నాయి.