సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పేలుడు..

by  |
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పేలుడు..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మహానగరంలోని సికింద్రాబాద్ రైల్వే‌స్టేషన్ దగ్గర పేలుడు సంభవించింది. ముత్యాలమ్మ ఆలయం వద్ద చెత్తడబ్బాలో ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఉదయం వేళ చెత్త ఏరుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు నగరంలో చాలా చోటుచేసుకున్నాయి. కాలం చెల్లిన పెయింట్ డబ్బాలను చెత్తకుప్పల్లో పడవేయటం వలన కెమికల్ రియాక్షన్ జరిగి, వాటిని కదిలించే ప్రయత్నంలో పేలుళ్లు సంభవిస్తాయని వెల్లడైంది. అయితే, ముత్యాలమ్మ ఆలయం వద్ద చోటుచేసుకున్న పేలుళ్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Next Story

Most Viewed