ఏపీలో 7వేల పోలీస్ ఉద్యోగాల భర్తీపై కసరత్తు

by  |
ఏపీలో 7వేల పోలీస్ ఉద్యోగాల భర్తీపై కసరత్తు
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులను నియమించినట్లు సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారని.. డిసెంబరు నాటికి శిక్షణ పూర్తి అవుతుందని సీఎం జగన్ వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో లా అండ్ ఆర్డర్‌పై చేసిన సమీక్షలో సీఎం జగన్ ఉద్యోగాల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది కనీసంగా 6 నుంచి 7వేల మంది పోలీసుల నియామకాలపై దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి ఆయా శాఖలు సిద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి సుచరిత, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్థిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


Next Story