ఎమ్మెల్యే కారులో రౌండ్స్ కొట్టిన ఎక్సైజ్ సీఐ..

by  |
ఎమ్మెల్యే కారులో రౌండ్స్ కొట్టిన ఎక్సైజ్ సీఐ..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎమ్మెల్యే కారులో ఎక్సైజ్ సీఐ జయశ్రీ తిరుగుతూ హల్‌చల్ చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు సమీపంలోని చోటుచేసుకుంది. బుధవారం ఆమె ఆకస్మాత్తుగా ఓ హోటల్‌లో ప్రవేశించి బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా హోటల్‌లోని సామగ్రిని సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు.

తాము సోమవారమే హోటల్ ప్రారంభించామని ఎలాంటి బెల్ట్ షాపు నిర్వహించడంలేదని హోటల్ నిర్వాహకులు మొర పెట్టుకున్నా ఆలకించలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి ఎక్సైజ్ సీఐ జయశ్రీ దౌర్జన్యం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన హోటల్‌లో రూ. 2 లక్షల విలువైన వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు.ఈ విషయంపై ఎక్సైజ్ సీఐ స్పందిస్తూ.. తన వాహనం చెడిపోవడం వల్లే తన తండ్రి కారులో రౌండ్స్‌కు వెళ్లినట్లు జయశ్రీ చెప్పారు. ఆ సమయంలో పోలీస్ సిబ్బంది కూడా తన వెంటే ఉన్నారని ఆమె వెల్లడించారు.


Next Story

Most Viewed