అవినీతి స్కీములతో అతిగా అప్పులు..!

32

దిశ వెబ్‎డెస్క్: అవినీతి చేసేందుకు పథకాల పేరుతో అతిగా అప్పులు చేస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు తిరస్కరించిన నగదు బదిలీ పథకాన్ని సీఎం జగన్ ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. దీంతో అధికంగా పంపుసెట్లు వాడే రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.