నల్లమల అడవిలో పురాతన గుడి.. గుప్తనిధుల కోసం తవ్వకాలు

by  |
నల్లమల అడవిలో పురాతన గుడి.. గుప్తనిధుల కోసం తవ్వకాలు
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండల సరిహద్దున గల శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయంలో గత రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది కూడా ఈ ఆలయంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కోసం రావడంతో ఇది గమనించిన గ్రామస్తులు పోలీసులకు పట్టించారు. తాజాగా కొందరు గుర్తు తెలియని దుండగులు ఆలయంలో చొరబడి.. డ్రిల్ మిషిన్ సాయంతో తవ్వకాలు చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం తవ్వకాలు జరిగినట్టు గ్రహించిన పూజారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed