- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫ్లాష్..ఫ్లాష్.. వరంగల్ లో మాజీ సర్పంచ్ పై దారుణం.. కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..

దిశ, ఏటూరునాగారం : మండల కేంద్రానికి చెందిన కొరస రమేష్ అనే మాజీ సర్పంచ్ ను మావోయిస్టులు రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. రమేష్ ప్రస్తుతం డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రమేష్ భార్య రజిత ప్రభుత్వాస్పత్రిలో ఏయన్ఏం గా పనిచేస్తోంది. వీరికి ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరైనా పిలిస్తే డ్రైవర్ పని కోసం రమేష్ వెళ్ళేవాడు.. ఖాళీ సమయంలో ఇంట్లోనే పిల్లలతో గడిపేవాడు. వీరి స్వగ్రామం నుగురు వెంకటాపురం మండలం సురవీడు (కొండాపురం)లో కాంగ్రెస్ పార్టీ నుండి 2014లో పోటీ చేసి సర్పంచ్ గా గెలిచారు. భార్య ఉద్యోగరీత్యా ఏటూరునాగారం లో ఉంటున్నారు.
రమేష్ విధి నిర్వహణలో భాగంగా మావోయిస్ట్ లతో పరిచయం ఏర్పడడంతో పలుమార్లు మావోయిస్ట్ కార్యకలాపాల్లో పనిచేసేవాడని స్థానికులు అంటున్నారు. ఈ మధ్య రమేష్ బిజీగా ఉండటంతో మావోయిస్టులు చెప్పిన మాటలు వినక పోవడంతో రమేష్ ను పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. అయితే రమేష్ భార్య తన భర్త అభం శుభం తెలియని వాడు అని, తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మావోయిస్టులు క్షమించి వదిలేయాలని వేడుకుంటోంది.
నాకు ఇద్దరు చిన్నపిల్లలు, అని నా భర్త లేకుంటే మేము ఎలా బ్రతకడం అని ఆమె బోరున విలపిస్తోంది. ఈ ఘటనతో మళ్లీ మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సబ్ డివిజన్ పరిధిలోని మండలాలైన ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు, మండలాలలో భయానక వాతావరణం నెలకొంది.