కేంద్రంపై మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఫైర్

by  |
Ex MLA gummadi Narsaiah
X

దిశ, ఇల్లందు: వామపక్షాల ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా ఇల్లందులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఎమ్మార్వో కృష్ణవేణికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఈ నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్క నెలలోనే 20 సార్లు పెంచి దేశ ప్రజలు నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు బతకడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చంద్ర అరుణ, అబ్దుల్ నబీ, దేవులపల్లి యాకయ్య, బంధం నాగయ్య, రామ్ సింగ్, తాళ్లూరి కృష్ణ, దేవరకొండ శంకర్, నాగేశ్వరరావు, ఆలేటి కిరణ్, వజ్జా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed