క‌న‌ప‌డ‌ని శ‌త్ర‌వుపై యుద్దం : మంత్రి

by  |
క‌న‌ప‌డ‌ని శ‌త్ర‌వుపై యుద్దం : మంత్రి
X

దిశ, న‌ల్ల‌గొండ‌: మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా వైరస్ కనపడని శత్రువుగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆటువంటి శత్రువు మొదటగా అవహించేది ఆత్మీయులదేనని ఆయన వాపోయారు. అటువంటి మహమ్మారీపై యుద్ధం చేస్తున్న మనకు ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని ఆయన తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా సరిహద్దుల్లో సైనికుల వలే విధులు నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు, పోలీస్, పారిశుధ్య కార్మికులకు బుధవారం న‌ల్ల‌గొండ‌లో ఉచితంగా బత్తాయి పండ్లను మంత్రి జగదీశ్ రెడ్డి పంపిణీ చేశారు. రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉండడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధిక దిగుబడి ఉన్న బత్తాయి వాడకం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ మీద మానవ సమాజం చేస్తున్న యుద్దంలో సామాజిక దూరాన్ని ఆయుధంగా మార్చుకుంటే విజయం సొంతం అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో ఎన్నో ఆయుధాలను సృష్టించుకున్నామని విధివశాత్తు అవన్నీ మరణహోమానికే ఉపయోగపడ్డాయన్నారు.

Tags: Everyone, careful, coronavirus, nalgonda, minister jagadish reddy



Next Story

Most Viewed