బిగ్ బ్రేకింగ్ : దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవండి.. మామ, అల్లుడికి ఈటల భారీ సవాల్..

by  |
బిగ్ బ్రేకింగ్ : దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవండి.. మామ, అల్లుడికి ఈటల భారీ సవాల్..
X

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నిక రాజకీయ రణరంగంలా మారింది. ఇటీవల నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులపై తాజాగా ఈటల రాజేందర్ స్పందించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్‌లో ముదిరాజ్ కులస్తులు బీజేపీలో చేరిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా నా గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ బక్క పల్చటి పిల్లగాడు, దిక్కులేనోడు అనుకోవద్దు. హుజురాబాద్ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను.. అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. పదేసి లక్షలు దళితబంధు ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాల వారీగా తాయిలాలిచ్చినా.. వారి గుండెళ్లో నేనే ఉన్నానంటూ వ్యాఖ్యానించారు.

రేపు ఎన్నికల్లో చూసుకుందాం, ప్రజల ఓట్లతో వచ్చిన మీ పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారు జాగ్రత్త.. అంటూ రాజేందర్ హెచ్చరించారు. తనను ఓడించేందుకు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేస్తారట.. గతంలో ఏనాడు హుజురాబాద్‌లో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు వాళ్ల ప్రేమంతా మీ ఓట్లపైనే. నన్ను కాపాడుకుంటరా.. చంపుకుంటరా మీ ఇష్టమన్నారు. ఎక్కడ దు:ఖం ఉన్నా, ఆపద ఉన్నా అక్కడుండే బిడ్డనని, ఓట్ల మీద తప్ప హుజురాబాద్ దళితులపై కేసీఆర్‌కు ప్రేమ లేదన్నారు. హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్, ఓట్లయ్యాక ఆ హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అనే రకం సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు.

దమ్ముంటే ప్రలోభాలు బంద్ చేసి, పోలీసులను వెనక్కి రప్పించుకుని నిజాయతీగా ఎన్నికల్లోకి రావాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనకపోతే రైతుల బతుకులు ఆగమైతాయని, ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరినందుకే నామీద కేసీఆర్ కోపం పెంచుకున్నారన్నారు. కమ్యూనిటీ హాళ్లకు, దేవాలయాలకు నిధులిస్తే తప్పులేదు. ఆ సొమ్మంతా మీదే ఖచ్చితంగా తీసుకోండి, కానీ తెల్లబట్టలో పసుపు, బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారు అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలని హుజురాబాద్ ప్రజలను కోరారు. ఏమిచ్చినా తీసుకోండి. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయండని రాజేందర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తాను పని చేస్తేనే గెలిచారని.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాని ఈటల స్పష్టంచేశారు.



Next Story

Most Viewed