అవుట్ డోర్‌లో హీరోయిన్‌పై నిర్మాత లైంగిక వేధింపులు.. ధ్రువీకరించిన హాట్ బ్యూటీ 

125
Esha Gupta

దిశ, సినిమా: బాలీవుడ్ నటి ఈషా గుప్తా కాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హాట్ బ్యూటీ ఇండస్ర్టీలో రెండుసార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అదే సమయంలో స్టార్ కిడ్స్‌కు మాత్రం ఇలాంటి సమస్య లేదని చెప్పింది. వాళ్ల జోలికి వెళ్లేందుకే ఆలోచిస్తారని.. పేరెంట్స్‌కు విషయం తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసని వివరించింది. ‘ఓ సినిమా కోసం అవుట్ డోర్ షూటింగ్‌కు వెళ్లాం. అక్కడ ఊహించని సంఘటన ఎదురైంది. నాకోసం ప్రత్యేక రూమ్ కేటాయించారు. కానీ నేను ఒంటరిగా నిద్రపోలేనని మేకప్ ఆర్టిస్ట్‌ను నా గదిలో పడుకునేలా ప్లాన్ చేశాను. ఇది గమనించిన సహ నిర్మాత షూటింగ్ మొదలైన నాలుగు రోజులకే నన్ను సినిమా నుంచి తప్పించే ప్లాన్ చేశాడు. ఈషా వద్దు.. ఆమెను ఇక్కడి నుంచి పంపించేయండి. ఉన్నా ఏం ప్రయోజనం లేదు. నాకు పనికి రాని వారు అవసరం లేదని నిర్మాతతో వాదించాడు. కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు’ అని తెలిపింది. అలాగే మరో సినిమాలో దర్శకుడు తనతో దుర్భాషలాడడంతో సెట్‌ నుంచి వెళ్లిపోయానని, క్షమాపణ చెప్పే వరకు షూటింగ్‌ను కొనసాగించలేదని ఈషా గుప్తా వివరించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..