రైతులకు రుణాలందించేందుకు ఎస్కార్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ భాగస్వామ్యం!

by  |
ICICI Bank
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రముఖ వ్యవసాయ సంబంధిత పరికరాల తయారీ సంస్థ ఎస్కార్ట్స్ అగ్రి మెషినరీ, ఇండస్ఇండ్ బ్యాంక్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా వ్యవసాయానికి సంబంధించి సరసమైన వడ్డీ రేట్లతో రుణాలు అందించనున్నట్టు ఇరు సంస్థలు వెల్లడించాయి. వినియోగదారుల ఆర్థిక అవసరాలను అర్థం చేసుకునేందుకు, తదనుగుణంగా ఆర్థిక పరమైన సహాయాన్ని అందించేందుకు కలిసి పనిచేయనున్నట్టు తెలిపాయి. వ్యవసాయ ఉత్పాదకత, ఆదాయాన్ని పెంచేందుకు ఆధునిక పరికరాల కోసం పెట్టుబడులను ప్రోత్సహించడం తమ ఒప్పందం లక్ష్యమని ఎస్కార్ట్స్ అగ్రి మెషినరీ సంస్థ అభిప్రాయపడింది.

‘గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగం రికార్డు వేగంతో అభివృద్ధి చెందుతోంది. తమ వినియోగదారులు సాంకేతికంగా అధునాతన వ్యవసాయ పద్దతుల వైపు మళ్లడం చూస్తున్నాం. ఈ క్రమంలో వారికి మెరుగైన ఉత్పత్తులను అందించడం, ఆయా పరికరాల కొనుగోలు ప్రక్రియను సాధ్యమైనంత సులభతరం చేయడం మా పని అని’ ఎస్కార్ట్స్ అగ్రి మెషినరీ సీఈఓ షేను అగర్వాల్ చెప్పారు. ఈ ఒప్పందం ఇండస్ఇండ్ బ్యాంక్ గ్రామీణ వినియోగదారుల వద్దకు మరింత చేరువ కాగలం. అలాగే, దేశవ్యాప్త్నగా ఎస్కార్ట్స్ అగ్రి మెషినరీతో భాగస్వామయం పారదర్శకంగా, రైతులను ఆదుకోవడానికి వీలవుతుందని’ ఇండస్ఇండ్ బ్యాంక్ వినియోగదారుల రుణ విభాగానికి చెందిన ఎస్‌వీ పార్థసారథి తెలిపారు.



Next Story

Most Viewed