ఎన్‌కౌంటర్‌పై ఆరా.. ఛత్తీస్‌గఢ్ సీఎంకు అమిత్ షా ఫోన్

by  |
ఎన్‌కౌంటర్‌పై ఆరా.. ఛత్తీస్‌గఢ్ సీఎంకు అమిత్ షా ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 8 మంది జవాన్లు మృతి చెందగా, మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఇప్పటివరకూ ఏడుగురు జవాన్ల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో గల్లంతైన జవాన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌కు ఫోన్ చేశారు. బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ సమీపంలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ ఘటనపై ఆరా తీశారు. ఈ ఎన్‌కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులుకావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత 21 మంది భద్రతా దళాల సిబ్బంది ఆచూకీ కనిపించడం లేదు. వీరిలో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది.

Next Story