- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేపటి నుంచి విధులు బహిష్కరించనున్న ఆ ఉద్యోగులు!

దిశ, ఏపీ బ్యూరో: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధుల మళ్లింపు ఆరోపణలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల నిధుల జోలికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ వెళ్లలేదని, ఇకమీదట కూడా వెళ్లదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే వర్సిటీ నిధులను వినియోగించుకుందని ఆరోపించారు. తమ ప్రభుత్వ కార్యాకలాపాలపై పనిగట్టుకొని ఆరోపణలు చేయడమే పనిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి సురేశ్ వ్యాఖ్యానించారు. ఇకపోతే ఇన్నాళ్లు దాచిపెట్టిన నిధులను ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో జమచేయడంపై మంగళవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు నిరసన బాటపట్టారు.
బుధవారం నుంచి విధులు బహిష్కరిస్తున్నామని వర్సిటీ ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. ఎన్టీఆర్ వర్సిటీ పరిణామాలపై గవర్నర్‌కు నివేదిస్తామని జేఏసీ కన్వీనర్ వెంకటనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వ ఫైనాన్స్ కార్పొరేషన్ క్రెడిబిలిటీపై తమకు నమ్మకం లేదని ఉద్యోగులు ప్రకటించారు. ఎలాంటి హక్కులు లేని సంస్థలో రూ. వందల కోట్లు జమచేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్శిటీ ఉద్యోగుల నిరసనలకు ఇతర సంఘాలు మద్దతు ప్రకటించాయి. సోమవారం అత్యంత రహస్యంగా వర్సిటీ నిధుల బదలాయింపు ప్రక్రియ జరిగిపోయింది. ప్రొసిడింగ్స్ ఇచ్చే వరకూ ఉద్యోగులకు కూడా తెలియకుండా చేసేశారు. ఉద్యోగులు తెలుసుకునే లోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. వర్సిటీ నిధులు మొత్తం రూ.400 కోట్లను స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌కు మళ్లించారు.
- Tags
- employees