ట్రెండింగ్‌లో ఎమోజీ మేకప్ చాలెంజ్

104

దిశ, ఫీచర్స్ : మన భావోద్వేగాల్ని అవతలి వ్యక్తికి ఈజీగా తెలియజేసేందుకు ‘ఎమోజీ’లను ఉపయోగిస్తుంటాం. సోషల్ మీడియాలో ‘ఎమోజీ’లను ఉపయోగించకుండా చాట్ చేయని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. మన ఎమోషన్‌లో భాగమైపోయిన ఆ ఎమోజీలతో ప్రస్తుతం ఓ కొత్తరకం చాలెంజ్ తెరమీదకు వచ్చింది. నూతనత్వంతో పాటు సృజనాత్మకతను చాటుకునేందుకు ‘ఎమోజీ మేకప్ చాలెంజ్’ నెటిజన్లకు సవాల్ విసరడంతో ఈ ట్రెండ్ వైరల్ అయింది. మరి ఎవరి ముఖాల్లో ఏయే ఎమోజీ ఎలా ఒదిగిపోయింది, చాలెంజ్‌లో భాగంగా నెటిజన్లు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.

‘ఎమోజీ మేకప్ చాలెంజ్’లో పాల్గొనే నెటిజన్లు తమ కళాత్మకతకు సృజనాత్మకతను జోడించి భిన్నంగా ముస్తాబవుతూ.. ఇతరులకు సవాల్ విసురుతున్నారు. చాలెంజ్‌లో భాగంగా కొన్ని ఎమోటికాన్‌లను ఎన్నుకుంటున్న నెటిజన్లు.. వాటికి తమ ఊహను జోడిస్తూ, భావం చెడిపోకుండా భిన్నమైన మేకప్‌లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బనానా నుంచి పుచ్చకాయ వరకు, సముద్రపు తరంగాల నుంచి జాలువారే జలపాతం వరకు, భయపెట్టే రాక్షస ముఖాలు, క్రూరమైన జంతువులు, సూపర్ హీరోల చిత్రాలను తమ ముఖంపై తీర్చిదిద్దుతూ అలంకరణ నైపుణ్యాలను చాటుకుంటున్నారు. కొందరు సరళమైన, సహజమైన రంగులను ఎంచుకుంటుండగా, మరికొందరు వారి మేకప్ నైపుణ్యాలను వేరే స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది నెటిజన్లు ఈ మేకప్ చాలెంజ్‌లో భాగంకాగా, ఎమోజీ చాలెంజ్(#Emojichallenge), ఎమోజీ మేకప్(#emojimakeup ) హ్యాష్‌ట్యాగ్‌లతో తమ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకుంటున్నారు. ఎమోజీ మేకప్‌ చాలెంజ్‌లో భాగంగా ‘కప్‌కేక్ లుక్ ఎమోజీ, బనానా ఎమోజీ, లీవ్స్, గ్లోయింగ్ హార్ట్, స్కై, రెయిన్‌బో, పార్టీ పాపర్, బటర్ ఫ్లై, బ్యాట్, ఆక్టోపస్.. వంటి రకరకాల ఎమోజీ లుక్స్ ట్రై చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..