ఏదో దాస్తున్నారు : శరద్ పవార్

by  |

ఎల్గర్ పరిషత్ కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించడం ద్వారా మహారాష్ట్రలో అప్పటి ఫడ్నవీస్ ప్రభుత్వం ఏదో దాచాలనుకుంటోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో మానవ హక్కుల కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని పవార్ గతంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించే ముందు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండాల్సిందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది ‘జాతి వ్యతిరేక చర్యా’ అని ప్రశ్నించారు. కోరెగాం – భీమా అల్లర్లు చెలరేగినపుడు మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. ప్రస్తుతం కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం చూస్తుంటే..ఫడ్నవీస్ ప్రభుత్వం ఏదో దాచాలనుకుంటున్నట్టు కనబడుతోందని పవార్ తెలిపారు.

Next Story

Most Viewed