విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు ఈనెల 17కు వాయిదా

by  |
supreme court notices to twitter
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆంధ్ర, తెలంగాణ మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసు ఈనెల 17కు వాయిదా పడింది. ధర్మాధికారి కమిటీ సిఫారసుల ప్రకారం 550 మంది దాకా ఆంధ్రా విద్యుత్ సంస్థలకు చెందిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. అయితే ఆంధ్రా స్థానికత కలిగిన వారిని తెలంగాణకు ఎలా కేటాయిస్తారని, అది ధర్మాధికారి కమిటీ కాదని అధర్మాధికారి కమిటీ అని తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్మాధికారి కమిటీ సిఫారసులపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

గతంలో ధర్మాధికారి కమిటీ తుది తీర్పు ప్రకారం తెలంగాణ విద్యుత్ సౌధలో రిపోర్డు చేయడానికి ఏపీకి చెందిన విద్యుత్ ఉద్యోగులు వచ్చిన టైములో తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగి వారిని అడ్డుకున్నారు. ఆ టైములో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఏపీ ఉద్యోగులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన వారికి జీతాలు కూడా చెల్లించాలని సుప్రీం కోర్టు గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed