పాఠశాల స్థాయి నుంచే రక్షణ రంగంలో శిక్షణ : AISSEE- 2023

by Disha Web Desk 17 |
పాఠశాల స్థాయి నుంచే రక్షణ రంగంలో శిక్షణ : AISSEE- 2023
X

2023-24 విద్యా సంవత్సరానికి 6,9 తరగతుల్లో ప్రవేశానికి సైనిక్ స్కూల్స్ ప్రవేశ ప్రకటన విడుదలైంది.

సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. వీటికి తోడు అదనంగా 18 స్కూల్స్ ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

నోటిఫికేషన్ వివరాలు:

ఎంపిక: 6, 9 తరగతులకు ప్రవేశ పరీక్షలలో చూపిన ప్రతిభ, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయసు: 6వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 1, 2011 నుంచి మార్చి 31, 2013 మధ్య జన్మించి (బాలురు, బాలికలు) ఉండాలి.

9వ తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 1, 2008 నుంచి మార్చి 31, 2010 మధ్య జన్మించిన వారై ఉండాలి.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు/8వ తరగతి విద్యార్థులు అర్హులు.

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2022.

పరీక్ష తేదీ: జనవరి 8, 2023.

6వ తరగతి ప్రవేశ పరీక్ష విధానం:

ప్రవేశ పరీక్షలో 300 మార్కులు ఉంటాయి.

మొత్తం 125 ప్రశ్నలు ఇస్తారు. దీనికి సమయం 2:30 నిమిషాలు ఉంటుంది.

మ్యాథ్స్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. (ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి)

లాంగ్వేజ్ (ఇంగ్లీష్/హిందీ/తెలుగు) - 25 ప్రశ్నలు

జనరల్ నాలెడ్జ్ (సోషల్ అండ్ సైన్స్) - 25 ప్రశ్నలు

ఇంటెలిజెన్స్ - 25 ప్రశ్నలు ఉంటాయి.

ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు.

9వ తరగతి ప్రవేశ పరీక్ష విధానం:

ఈ పరీక్ష మొత్తం 400 మార్కులకు ఉంటుంది.

దీనిలో 150 ప్రశ్నలుంటాయి; సమయం 3 గంటలు

మ్యాథ్స్ లో 50 ప్రశ్నలు అడుగుతారు ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.

ఇంగ్లీష్; ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి.

సైనిక్ స్కూల్స్ సీట్ల వివరాలు:

మొత్తం సీట్లలో 67 శాతం సైనిక్ స్కూల్స్ ఉన్న రాష్ట్రం /UT ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. 33 శాతం ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తారు.

మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కోరుకొండ సైనిక్ స్కూల్ లో ఆరో తరగతికి 68 సీట్లు ఉంటాయి.

వీటిలో 10 బాలికలకు, 58 బాలురకు కేటాయించారు.

9వ తరగతిలో 22 సీట్లుండగా వాటిలో బాలురకు మాత్రమే అవకాశం ఉంటుంది.

కలికిరి సైనిక్ స్కూల్ లో 6వ తరగతికి 70 సీట్లు అందులో 60 బాలురకు, 10 బాలికలకు కేటాయిస్తారు.

9వ తరగతిలో 30 సీట్లు బాలురకు మాత్రమే ఉంటాయి.

ప్రయోజనాలు: దేశంలో ప్రభుత్వ నియామకాల్లో సింహభాగం రక్షణ రంగంలోనే ఉంటాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది యానియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎన్‌డీఏ, ఎన్ఏ పరీక్షలు. వీటిని లక్ష్యంగా చేసుకున్న వారికి స్కూల్ స్థాయి నుండే సరైన శిక్షణ వ్యక్తిగత క్రమశిక్షణలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

సైనిక్ స్కూల్ విద్యార్థులు ఎన్ డీఏ, ఎన్ ఏ, సీడీఎస్ఈ తో పాటు ఇతర డిఫెన్స్ పరీక్షల్లో అత్యున్నతంగా రాణించే అవకాశం ఉంటుంది.

రక్షణ రంగ అధికారిగా.. తేలికగా తమ కెరీర్ ను మలుచుకునే అవకాశం ఈ సైనిక్ స్కూల్ శిక్షణ ద్వారా అందిపుచ్చుకోవచ్చు.

- జి. జనార్థన్ రెడ్డి, డైరెక్టర్ ..రెయాన్ సైనిక్ స్కూల్.

నాగోల్, హైదరాబాద్.


Next Story

Most Viewed