తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలు

by Disha Web Desk 13 |
తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలు
X

దిశ, ఎడ్యుకేషన్: మిలిటరీ ఎడ్యుకేషన్, త్రివిధ దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. 2023- 23 విద్యా సంవత్సరానికి 6వ తరగతి అడ్మిషన్ కోసం అర్హులైన బాలుర నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

6 వ తరగతి ప్రవేశాలు: 80 సీట్లు.

గ్రూపులు: ఎంపీసీ

రిజర్వేషన్లు వర్తిస్తాయి.

సంస్థ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల, కుర్మాపూర్, కరీంనగర్ జిల్లా.

అర్హత: 2022 -23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణులైన బాలురు అర్హులు.

తెలుగు/ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో అయితే రూ. 2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతంలో అయితే రూ. 1 లక్ష 50 వేలకు మించరాదు.

వయసు: ఏప్రిల్ 1, 2023 నాటికి 11 ఏళ్లకు మించరాదు.

ఏప్రిల్ 1, 2012 నుంచి మార్చి 31, 2014 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: మూడంచెల్లో ఎంపిక చేస్తారు.

స్టేజ్ 1: స్టేట్ లెవల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ - 100 మార్కులు.

స్టేజ్ 2: స్క్రీనింగ్ టెస్టులు - 150 మార్కులు.

ఇందులో ఫిజికల్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ పరీక్ష, కమ్యూనికేషన్ స్కిల్ టెస్టులు ఉంటాయి.

స్టేజ్ 3: వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 31, 2023.

చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2023.

ప్రవేశ పరీక్ష: ఫిబ్రవరి 26, 2023.

రాత పరీక్ష ఫలితాలు: మార్చి 8, 2023.

ఫిజికల్ ఫిట్‌నెస్ తేదీలు: మార్చి 20,22, 24,25,26/2023.

తుది ఫలితాలు: మార్చి 28, 2023.

ప్రవేశాలు ప్రారంభం: మార్చి 30, 2023.

వెబ్‌సైట్: https://www.tswreis.ac.in


Next Story

Most Viewed