ఆర్‌ఆర్‌బీ పరీక్ష కోసం ప్రత్యేక రైళ్లు

by Mahesh |
ఆర్‌ఆర్‌బీ పరీక్ష కోసం ప్రత్యేక రైళ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష కోసం 65 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9, 10 తేదీల్లో నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ (ఎన్‌టీపీసీ) కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ 2) రెండో దశ పరీక్షకు హాజరయ్యే అభ్యుర్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించిందని తెలిపారు. అయితే ప్రత్యేక రైళ్లకు రుసుం చెల్లించాలని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు వారికి జారీ చేయబడిన ట్రావెల్‌ అథారిటీ ప్రకారం (అర్హతకు అనుగుణంగా) ప్రత్యేక రైళ్లలో సీటు, బెర్తు రిజర్వ్ చేసుకోవచ్చని వివరించారు.

హైదరాబాద్‌- మైసూర్‌, సికింద్రాబాద్‌- విశాఖ, జబల్పూర్‌- నాందేడ్‌, హతియా-చీరాల, గుంటూరు- నాగర్‌సోల్‌, నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్- మైసూర్‌, కాకినాడ పట్టణం- కర్నూలు, ఆదిలాబాద్‌- చెన్నై సెంట్రల్‌, హుబ్బళి- ఔరంగాబాద్‌, డోన్‌- విజయవాడ, మచిలీపట్నం- ఎర్నాకుళం, కడప- విశాఖ, చీరాల-షాలిమార్‌, హటియా-విజయవాడ, నర్సాపురం-త్రివేండ్రం స్టేషన్‌లు మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారని పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి ఎక్కువ రైళ్లు అందుబాటులో ఉండనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed