Alert:టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్!

by Jakkula Mamatha |
Alert:టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్!
X

దిశ,వెబ్‌డెస్క్: CISF(Central Industrial Security Force)లో 1,124 ఖాళీలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో 845 కానిస్టేబుల్/ డ్రైవర్, 279 డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, 21-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET), PST, వైద్య పరీక్ష, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది. ఈ ఉద్యోగాలకు గత నెల 3వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ నెల 4వ తేదీతో గడువు ముగుస్తుంది. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను http://cisfrectt.cisf.gov.in సందర్శించండి.

అర్హతలు..

*కానిస్టేబుల్/ డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతి పాసై ఉండాలి.

*కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఉద్యోగల కోసం పదో తరగతితో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

*ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

*అప్లికేషన్ ఫీజు: ఎస్టీ, ఎస్సీ మరియు ఎక్స్ సర్వీస్‌మెన్ అబ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు

*ఈ పోస్టులకు అన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Next Story