- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలోనే అతిపెద్ద క్రాస్‌వర్డ్ పోటీకి ఆహ్వానం.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు!
దిశ, ఫీచర్స్ : చిక్కు ప్రశ్నలు, సుడోకు, పదవినోదం, దారి కనుక్కోండి, జిక్సా, క్రాస్‌వర్డ్స్ వంటి పలు రకాల పజిల్స్ మెదడుకు మేలు చేస్తాయి. వాటి వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా అలవడుతుంది. ఈ క్రమంలోనే విద్యార్థుల కోసం పాఠశాలలు, ఆర్గనైజేషన్స్ పజిల్స్‌కు సంబంధించిన పోటీలు నిర్వహిస్తుంటాయి. ఈ మేరకు భారతదేశపు అతిపెద్ద క్రాస్‌వర్డ్ పోటీ 'CCCC' (క్రిప్టిక్ క్రాస్‌వర్డ్ కాంటెస్ట్) మేలో జరగనుండగా, దేశంలోని 7–12 తరగతుల విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు.
క్రిప్టిక్ క్రాస్‌వర్డ్ కాంటెస్ట్ (CCCC)-2022 కోసం 7–12 తరగతుల విద్యార్థులు ఎన్‌రోల్ చేసుకోవాల్సిందిగా పాట్నా సివిల్ సొసైటీ గ్రూప్ ఎక్స్‌ట్రా-సి కోరుతోంది. ఇందుకోసం మే 15 నుంచి crypticsingh.comలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లుగా నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏదైనా గుర్తింపు పొందిన భారతీయ పాఠశాల బోర్డు స్టూడెంట్స్ ఈ పోటీలో పార్టిసిపేట్ చేసేందుకు అర్హులు కాగా ఒకే పాఠశాలలోని వివిధ తరగతుల విద్యార్థులు కూడా ఒక జట్టుగా ఆడవచ్చు.
షెడ్యూల్..
మే నుంచి నవంబర్ వరకు మూడు దశల్లో పోటీలు జరుగుతాయి. ఈ కాంపిటీషన్స్‌లో 1వ దశ వరుస ఆదివారాల్లో నాలుగు ఆన్‌లైన్ రౌండ్స్‌లో జరుగనుంది.
మే 29 - ప్రాక్టీస్ రౌండ్
జూన్ 05 - రౌండ్ 1
జూన్ 12 - రౌండ్ 2
జూన్ 19 - రౌండ్ 3
స్టేజ్ 1..
ప్రతీ రౌండ్ కోసం, క్లూలతో కూడిన క్రాస్‌వర్డ్ గ్రిడ్ మధ్యాహ్నం 2 గంటలకు crypticsingh.comలో అప్‌లోడ్ చేస్తారు. ప్రతీ బృందం సాయంత్రం 5 గంటలలోపు గ్రిడ్‌ను పరిష్కరించి సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తిగల అన్ని జట్లు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఇక ప్రాక్టీస్ రౌండ్ అనేది ఆటగాళ్లకు ఫార్మాట్‌ను పరిచయం చేసేందుకు మాత్రమే ఉద్దేశించిందనది కాగా ఇది ముగిసిన తర్వాత మూడు (1,2,3) రౌండ్ల నుంచి స్కోర్స్‌ను ఉపయోగించి లీడర్‌బోర్డ్ రూపొందిస్తారు. ఈ బోర్డులోని టాప్ 100 జట్లు ప్రతీ రౌండ్ చివరిలో టాప్ 20 జట్లతో పాటు స్టేజ్ 2 కి అర్హత సాధిస్తాయి. స్కోరింగ్ అనేది పరిష్కార వేగం, కచ్చితత్వం పై ఆధారపడి ఉంటుంది.
స్టేజ్ 2 ..
ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ రౌండ్‌ల మధ్య ముఖాముఖిగా ఎంచుకోవడానికి జట్లను అనుమతిస్తుంది. ఇందులోని టాప్ ప్లేయర్స్ స్టేజ్ 3కి ఎంపిక కావడమే కాకుండా ఈ శీతాకాలంలో న్యూ ఢిల్లీలో జరిగే జాతీయ గ్రాండ్ ఫైనల్‌లో పార్టిసిపేట్ చేస్తారు.
CCCC చరిత్ర..
CCCC జూన్ 2013లో సుధా ఆల్-ఇండియా క్రిప్టిక్ క్రాస్‌వర్డ్ కాంటెస్ట్ (SAICCC)గా ప్రారంభమైంది. US వార్తాపత్రిక న్యూయార్క్ వరల్డ్‌లో 1913లో ఆర్థర్ వైన్ ప్రచురించిన మొదటి క్రాస్‌వర్డ్ పజిల్‌కు 100 సంవత్సరాల గుర్తుగా ఇది ప్రారంభించబడింది. కాగా 2014లో ఈ పోటీని CBSE క్రిప్టిక్ క్రాస్‌వర్డ్ పోటీగా రీబ్రాండ్ చేశారు. దీన్నే CCCC గా పిలుస్తున్నారు. ఈ ఈవెంట్‌ను అనధికారికంగా నేషనల్ క్రాస్‌వర్డ్ పోటీ అని కూడా పిలుస్తారు. అంతేకాదు క్రాస్‌వర్డ్‌లో అతిపెద్ద ఈవెంట్‌గా ఇది 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్' కూడా సాధించింది.
2021 పోటీలు..
378 పట్టణాలకు చెందిన 10,326 పాఠశాల బృందాలు 2021లో CCCC కోసం నమోదు చేసుకున్నాయి. 2020లో COVID-19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ఈవెంట్ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇక గతేడాది జాతీయ చాంపియన్స్‌గా నిలిచిన కుహూ గోయెల్, ఆషిస్ రూ.21,000 నగదుతో పాటు ట్రోఫీని గెలుచుకున్నారు.