- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 162 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం (ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఈఏపీసెట్ .. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు ఉంటాయి.
వివరాలు:
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు - 2023.
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: పదో తరగతి మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 200 చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ. 150 ఉంటుంది.
చివరి తేదీ: జూన్ 7, 2023.
వెబ్‌సైట్: https://apms.apcfss.in/