- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రూప్ -1 మెయిన్స్.. ప్రశ్నల స్థాయి ఇదే
కంపల్సరీ ప్రశ్నల ఉద్దేశం:
కంపల్సరీ ప్రశ్నల ఉద్దేశం -సబ్జెక్టుపై పట్టు పరీక్షించడమే..
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకోసం టీఎస్‌పీఎస్సీ ఈ నెల 18న ప్రశ్నల సరళిని విడుదల చేసింది. దీని ప్రకారం పేపర్-2 నుండి 6 వరకు ప్రతి సెక్షన్‌లో మొదటి రెండు ప్రశ్నలను తప్పనిసరి చేశారు. కాని పేపర్ - 6లో మూడవ సెక్షన్‌కు 30 ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో ఐదు ప్రశ్నలను చాయిస్‌గా వదులు కోవచ్చని సూచించారు.
అయితే ఈ కంపల్సరీ ప్రశ్నల సరళి అనేది గతంలో యూపీఎస్‌సీ పరీక్షలో ఉండేది. ప్రస్తుతం కూడా కొన్ని సబ్జెక్టుల్లో కంపల్సరీ ప్రశ్నల సరళి ఉంది. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే సిలబస్ ప్రకారం మొదటి రెండు యూనిట్ల నుండే కంపల్సరీ ప్రశ్నలు రావు. ఆ సెక్షన్ మొత్తం నుండి తొలి రెండు ప్రశ్నలను కంపల్సరీగా రాయవలసి ఉంటుంది.
కంపల్సరీ ప్రశ్నల ముఖ్య ఉద్దేశాలు:
సబ్జెక్టు మొత్తాన్ని చదవడం కాదు, సబ్జెక్టు యొక్క లోతును, సారాంశాన్ని తెలుసుకోవడం.
ప్రతి టాపిక్‌పై పట్టు ఉండటం కాదు, టాపిక్ ఉద్దేశం ఏమిటని తెలుసుకోవాలి.
ప్రశ్నలను ఏ విధంగానైన ఇస్తారనేది కాదు, సందర్భాన్ని బట్టి సమకాలిన పరిస్థితులనూ దృష్టిలో పెట్టుకుని అడిగే అవకాశం ఉంది.
ప్రశ్నలను ఇష్టం వచ్చినట్లు రాస్తే సరిపోదు.. అడిగిన దానికి తగ్గట్టు సమాధానం రాయడమే ముఖ్యం.
సమాచారాన్ని సంక్షిప్తంగా, సూటిగా, పదాల కూర్పులతో రాయవలసి ఉంటుంది.
పేపర్ -2: చరిత్ర, సంస్కృతి.. జాగ్రఫీ:
సెక్షన్ - 1: ఆధునిక యుగాన్ని (1757 నుంచి 1947) ప్రత్యేకంగా భావిస్తూ భారతదేశ చరిత్ర.. సంస్కృతిని తెలుసుకోవడం.
*ఈ మొదటి సెక్షన్ నుండి తొలి రెండు ప్రశ్నలను తప్పనిసరిగా రాయాలి. మిగతా 3 ప్రశ్నలకు చాయిస్ ఉంటుంది.
*తప్పనిసరి ప్రశ్నలను ఏ విధంగా మనం గుర్తించవచ్చు అంటే సబ్జెక్టుపై సంపూర్ణమైన అవగాహన ఉండి.. దానితో పాటు సిలబస్ ఉద్దేశం తెలిసినప్పుడు.
*ఈ సెక్షన్‌లో మూడు సబ్జెక్టులు ఉన్నాయి. అవి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, భారతదేశ చరిత్రలు.
*తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకుని చదివితే సామాజిక మతపరమైన ఉద్యమాల వృద్ధి, విజృంభణ అంశం మీద కంపల్సరీ ప్రశ్నఅడుగుతారు. ఎందుకంటే తెలంగాణ సామాజిక స్వభావం దీనితో ముడిపడి ఉంది కాబట్టి.
*కుల వ్యతిరేక ఉద్యమాలు కూడా తెలంగాణ ప్రస్తుత సాంఘిక అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కంపల్సరీ ప్రశ్న కిందికి రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా జ్యోతిభాపూలె, పండిత రామబాయి మొదలైనవి.
*కమ్యూనలిజం, కమ్యూనిస్టు, సోషలిస్టు ఉద్యమాల వృద్ధి, ప్రస్తుతం ఇదే అంశాలు దేశాన్ని ఏ విధంగా ప్రభావితాన్ని చేస్తున్నాయి. సమాజంలో వస్తున్న మార్పులు ఏమిటి అనే అంశాలన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి.
*బ్రిటీష్ వలసపాలనలో భారతదేశ ఎకానమీ ఏవిధంగా ఉందన్నకోణంలో కూడా చదవాలి. ఈ అంశంతో తెలంగాణ రాష్ట్రానికి ఏవిధమైన సంబంధం లేకపోయినా ప్రాధాన్యత ఉంటుంది.
*తొలి నాగరికత అయిన సింధూ నాగరికతకు ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే హరప్ప నాగరికత కంటే ఇంకా పురాతనమైన నాగరికత. ఈ మధ్యకాలంలో తవ్వకాలలో బయటపడినవి పుస్తాకలలో పొందు పరచలేదు. కాబట్టి ఈ అంశాలన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చదివితే మంచిది.
*సూఫీ ఉద్యమాల స్వభావం, ప్రాధాన్యత తెలంగాణ సమాజంతో అనుసంధానం అయి ఉంది. విస్తృతంగా చూస్తే డెక్కన్ ప్రాంతంలో సూఫీ ఉద్యమానికి ఉర్దూ భాష ఒక వారధిగా పనిచేసింది. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సూఫీ ఉద్యమం ముఖ్యభూమిక పోషించింది.
*భారతదేశంలో, డెక్కన్ ప్రాంతంలో సమ్మిళిత సంస్కృతి ఆవిర్భావం అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి ముఖ్యంగా డెక్కన్ ప్రాంతంలో సమ్మిళిత సంస్కృతి చాలా ముఖ్యం. ఈ ప్రాంతాన్ని బహమనీలు ముఖ్యంగా కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీల కాలంలో సమ్మిళిత సంస్కృతి అభివృద్ధి చెందింది.
సెక్షన్ -2: తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక సంపద:
*తెలంగాణ రాష్ట్రా చరిత్రకు సంబంధించి చాలా అంశాలు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. కాకపోతే వాటిలో ఇంకా ముఖ్యమైన అంశాలను లోతుగా పరిశీలిస్తే మనకు చాలా అంశాలు తెలుస్తాయి.
*శాతవాహనులు తెలంగాణను పరిపాలించిన తొలి పూర్తి రాజవంశంగా చెప్పవచ్చు.
*శాతవాహనుల రాజధాని బోధన్ చాలా ప్రసిద్ధి చెందింది. కాని ఉమ్మడి ఏపీ చరిత్రలో మాత్రం పూర్తిగా ప్రాధాన్యతను తగ్గించి తెలంగాణ చరిత్రను విస్మరించారు. కాబట్టి శాతవాహనుల మీద అన్ని కోణాలతో ప్రశ్నలను చదువుకుని వెళితే మంచిది.
*ఇక్ష్వాకుల వంశం పరిపాలన కూడా తెలంగాణ చరిత్రతో ముడిపడి ఉంది. ఇక్ష్వాకుల రాజధాని ప్రస్తుత నాగార్ఝున కొండ ప్రాచీన చరిత్రలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్య కాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత పెరిగింది. ఈ మధ్య కాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టును నాగార్జున కొండలో ప్రారంభించింది.
*తెలంగాణలో బౌద్ధమతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే బావరి అనే వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినవారే. బౌద్దమత ప్రచారానికి కృషి చేసిన తొలి వ్యక్తిగా పేరున్నది. అంతేకాదు నాగార్జున కొండ పేరే ఆచార్య నాగార్జున పేరుమీదుగా వచ్చింది. కాబట్టి బౌద్ధం మీద చాలా దృష్టి సారించాలి.
*మధ్యయుగ తెలంగాణ చరిత్రలో కూడా చాలా అంశాలు ముఖ్యమైనవే. ఈ అంశం సిలబస్ ప్రకారం ముఖ్యమైనది కాదు అని చెప్పడానికి వీల్లేదు. అవి కాకతీయులు, వెలమ సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, సమ్మక్క సారక్క, సర్వాయి పాపన్న.
*అయితే మద్యయుగ తెలంగాణ చరిత్రలో దేని ప్రాధాన్యత దానికే ఉంది. కాకతీయుల పరిపాలనను గమనిస్తే యునెస్కో గుర్తించిన రామప్పదేవాలయం కాకతీయుల నాటిదే. కాకతీయులు సంక్షేమ పాలనను అందించడమే కాక కొలువులు, చెరువులను ముఖ్యంగా నాట్యం, కట్టడాలను ప్రపంచమే గుర్తించేటట్లు తమ ప్రతిభను పరిపాలనలో కనబరిచారు.
*వెలమ సామ్రాజ్యం ముఖ్యంగా దేవరకొండ, రాచకొండ ప్రాంతాలను పాలించినవారు తెలుగు సాహిత్యానికి కృషిచేసారు. వారు సాహిత్యానికి చాలా పేరుగాంచినవారు కాబట్టి సాహిత్య కోణాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే మంచి ఫలితం ఉంటుంది.
*కుతుభ్ షాహీలు తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని చాలా లోతుగా చదివితే మంచిది. ఎందుకంటే వీరి అధికార భాష పర్షియన్ అయినప్పటికి తెలుగు భాషకు ఎనలేని కృషిని అందించారు.