GATE-2023 ఫలితాలు విడుదల

by Disha Web Desk 17 |
GATE-2023 ఫలితాలు విడుదల
X

దిశ, ఎడ్యుకేషన్: దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2023 ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. అభ్యర్థులు లాగిన్ అయి ఫలితాలు చూసుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు.. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఐఐటీలు, ఎన్ఐటీ వంటి విద్యా సంస్థల్లో మాస్టర్స్ డగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్ స్కోర్ తప్పనిసరి. ఈ సంవత్సరం గేట్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహించింది.


Next Story