మీరు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. ఈ ప్రశ్నలు మీ కోసమే..

by Disha Web Desk 20 |
మీరు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. ఈ ప్రశ్నలు మీ కోసమే..
X

దిశ, ఫీచర్స్ : ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల పొందేందుకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి కచ్చితంగా ప్రశ్నలు వస్తుంటాయి. ఈ విభాగానికి రాగానే చాలామంది అభ్యర్థులు కాస్త భయపడుతుంటారు. కరెంట్ అఫైర్స్‌లో దేశంలో, విదేశాలలో జరిగే ప్రధాన ఈవెంట్‌లతో పాటు, క్రీడా ప్రపంచం, సైన్స్, ఎకానమీ, రాజకీయాల గురించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు.

ఈ క్రమంలోనే అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్ట, మధ్యంతర బడ్జెట్ 2024 కి సంబంధించిన ప్రశ్నలు, ఇటీవల ఎక్కువగా చర్చించిన కొన్ని అంశాలపైన ప్రశ్నలు పరీక్షల్లో అడగవచ్చు. వీటికి సంబంధించిన 10 ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు మరియు సమాధానాలు

ప్రశ్న 1 : 11,11,111 బడ్జెట్ 2024లో ఈ సంఖ్య ఎందుకు కనిపించింది ?

సమాధానం : ఈ సంవత్సరం ప్రభుత్వం బడ్జెట్ 2024లో తన మూలధన వ్యయాన్ని పెంచింది. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం 11.1 శాతం పెరిగింది. ఇప్పుడు ఈ మొత్తం రూ.11,11,111 కోట్లకు చేరింది.

ప్రశ్న 2 : లక్పతి దీదీ పథకం ప్రయోజనాన్ని ఎవరు పొందుతారు, ఏ పత్రాలు అవసరం ?

జవాబు : లక్పతి దీదీ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించనున్నారు.

ప్రశ్న 3 : కేంద్ర ప్రభుత్వం 'లఖపతి దీదీ యోజన' లక్ష్యాన్ని ఎంత పెంచింది ?

జవాబు : లక్పతి దీదీ పథకం విజయవంతం కావడంతో ప్రోత్సహించిన ప్రభుత్వం పథకం లక్ష్యాన్ని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచిందని ఆర్థిక మంత్రి తెలిపారు.

ప్రశ్న 4 : టీకా కోసం U-WIN ప్లాట్‌ఫారమ్ ఏమిటి ?

జవాబు : భారతదేశంలో మిషన్ ఇంద్రధనుష్ పథకం కింద టీకాలు వేయడానికి U-WIN ప్లాట్‌ఫారమ్ ప్రారంభించనుంది. దీంతో పిల్లలకు టీకాలు వేయించడం మరింత సులువుగా మారనుంది.

ప్రశ్న 5 : ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఏముంది ?

జవాబు : బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలగలేదు. ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రశ్న 6 : రామ మందిరాన్ని ఎవరు రూపొందించారు ?

జవాబు : అహ్మదాబాద్‌కు చెందిన చంద్రకాంత్ సోంపురా, అతని కుమారుడు ఆశిష్ సోంపురా మోడల్ డిజైన్‌ను సిద్ధం చేశారు.

ప్రశ్న 7 : శ్రీరాముని విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు ?

జవాబు : రామ మందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని చెక్కిన వ్యక్తి పేరు అరుణ్ యోగిరాజ్. యోగిరాజ్ కర్ణాటకలోని మైసూర్ నివాసి.

ప్రశ్న 8 : రామ మందిర నిర్మాణానికి ఎంత ఖర్చయింది ?

జవాబు : రామమందిర నిర్మాణానికి దాని ప్రతిష్టాపన వరకు దాదాపు రూ. 1100 కోట్లు ఖర్చయింది.

ప్రశ్న 9 : జనవరి 22న బాలరాముని విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు ?

జవాబు : శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం 22 జనవరి 2024న 84 సెకన్లపాటు ఉంది. ఈ కారణంగానే ఈ రోజున ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు.

ప్రశ్న 10 : రామ మందిరం ఏ రాతితో నిర్మించారు ?

జవాబు : రామ మందిర నిర్మాణంలో రాజస్థాన్‌లోని ప్రసిద్ధ మక్రానా రాయిని ఉపయోగించారు.



Next Story

Most Viewed