AP ICET - 2023 నోటిఫికేషన్

by Disha Web Desk 17 |
AP ICET - 2023 నోటిఫికేషన్
X

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023 (ఏపీ ఐసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యామండలి ఈ ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్‌కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

వివరాలు:

ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023 (ఏపీ ఐసెట్)

కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)/మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ)

అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ (ఇంటర్/డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు ఉండాలి)ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: కనీస వయసు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

పరీక్ష ఫీజు: రూ. 650 చెల్లించాలి (బీసీలకు రూ. 600, ఎస్సీ/ఎస్టీ వారికి రూ. 550 చెల్లించాలి)

దరఖాస్తు ప్రారంభం: మార్చి 20, 2023న దరఖాస్తులు ప్రారంభం.

చివరి తేదీ: ఏప్రిల్ 19, 2023.

పరీక్ష తేదీ: మే 24, 25/2023.

వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in

Also Read..

ఎయిమ్స్‌లో 45 జూనియర్ రెసిడెంట్ పోస్టులు


Next Story

Most Viewed