- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీసీ గురుకులాల్లో ప్రవేశాలు.. నేటి నుంచే దరఖాస్తులు.. చివరి తేదీ ఎప్పుడంటే?

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయా(BC Welfare Gurukul Vidyalayas)ల్లో ప్రవేశాల(Entrance)కు నేడు(గురువారం) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో బాల, బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6,7,8,9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు మార్చి 31 చివరి తేదీగా ప్రకటించారు. హాల్‌టికెట్ల(Hall Tickets)ను ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేస్తారు. ఈ తరుణంలో దరఖాస్తు(Application) చేసుకున్న విద్యార్థులకు వచ్చే నెల(ఏప్రిల్) 20వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల(Students) వయసు 6వ తరగతిలో ప్రవేశానికి 31-08-2025 నాటికి 12 సంవత్సరాలు మించకుండా.. 10 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకూడదు. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ఫీజు రూ.150 ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ http://mjptbcwreis.telangana.gov.in/ ను సందర్శించండి.