ఇప్పట్లో పరీక్షలు నిర్వహించలేం : ఏపీ మంత్రి సురేశ్

by  |
ఇప్పట్లో పరీక్షలు నిర్వహించలేం : ఏపీ మంత్రి సురేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్షల‌పై దుమారం కొన‌సాగుతోంది. పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్తుంటే… ప్రతిపక్షాలతోపాటు కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప‌రీక్షల నిర్వహ‌ణ‌పై అధికారుల‌తో చ‌ర్చించామ‌ని.. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే ప‌రిస్థితి లేదన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నప్పుడు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయం చేస్తున్నాయని మంత్రి సురేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయితే ఒక తండ్రిగా తాను పరీక్షల నిర్వహణకు మద్దతిస్తాన‌ని మంత్రి చెప్పుకొచ్చారు. ఆప్షన్స్ చూపకుండా పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. నారా లోకేశ్ లాగా అందరూ దొడ్డి దారిలో మంత్రి పదవులు పొందలేరని ఆదిమూల‌పు సురేష్ ధ్వజమెత్తారు. ఎవరో సీటు ఇప్పిస్తే ఆయ‌న‌ స్టాన్‌ఫోర్డ్‌లో చదివారని ఆరోపించారు. పరీక్ష రద్దు చేయడానికి ఒక నిమిషం పట్టదని.. కానీ తాము విద్యార్థులు భవిష్య‌త్ గురించే తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి సురేశ్ క్లారిటీ ఇచ్చారు.


Next Story

Most Viewed