సెంట్రల్ ఆసియాలో ఎస్ సీఓ పాత్ర ఏంటి?

by Disha edit |
సెంట్రల్ ఆసియాలో ఎస్ సీఓ పాత్ర ఏంటి?
X

నాటోలో సభ్యత్వం కలిగిన దేశం టర్కీ ప్రస్తుతం ఎస్‌సీఓలో సోషల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉంది. ఇది సోషల్ డైలాగ్ పార్టనర్‌గా రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.‌ టర్కీ 2009 లో టర్కిష్ భాష మాట్లాడే భాషలతో కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈయూ/ యూఎస్ దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగిన దేశాలు ముఖ్యంగా భారత్ వంటివి ఏ దేశానికీ ఒకవైపు ఒరిగిపోకుండా నూతన శకానికి నాంది పలకాలి.‌ ప్రస్తుతం బాధ్యతలు అందిపుచ్చుకుంటున్న భారత్ పారదర్శకంగా, అన్ని దేశాల రాజకీయ ఆర్థిక, భద్రత విషయాలను దృష్టిలో ఉంచుకుని తన పాత్ర పోషించాలి.‌ మనకు చైనాకు పాకిస్తాన్‌కు ఏ రకమైన సరిహద్దు సమస్యలు ఉన్నాయో, అలాగే ఆర్మీనియా అజర్‌బైజాన్ మధ్య సమస్యలు ఉన్నాయి.‌ కావున ఎస్‌సీఓ బాధ్యతలు చేపడుతున్న భారత్ చాకచక్యంగా వ్యవహరించి, సభ్య దేశాల అభివృద్ధికి కృషి చేయాలి.‌

షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్-ఎస్‌సీఓ' సమావేశాలు ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్ నందు సెప్టెంబర్ మొదటివారంలో జరిగాయి.‌ సభ్య దేశాధినేతలు, ఆహ్వానితులు హాజరై వారి వారి దేశాల రక్షణ, భద్రత, వివిధ రంగాలలో సహకారం కోసం చర్చించుకున్నారు. తొలుత రష్యా, చైనాతోపాటు సెంట్రల్ ఆసియా దేశాలు కిజిగిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌, టర్కిస్తాన్‌తో ప్రారంభమైన ఈ ఎస్‌సీఓలో 2017 నుంచి భారత్, పాకిస్తాన్, ఆ తరువాత ఇరాన్ సభ్య దేశాలుగా చేరాయి. ప్రపంచ జనాభాలో 40 శాతం, ప్రపంచ జీడీపీలో 30 శాతం ఈ ఎస్‌సీఓ దేశాలు కలిగి ఉన్నాయి.

ఇవి తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా ప్రభావితం అవుతాయని గ్రహించాలి. ఇంకా డైలాగ్ పార్టనర్స్‌గా టర్కీ, ఆర్మేనియా, అజర్‌బైజాన్, కాంబోడియా, నేపాల్, శ్రీలంక దేశాలు, అబ్జర్వ్ దేశాలుగా బెలారస్, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, అడిషనల్ డైలాగ్ పార్టనర్స్‌గా సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్టు ఉన్నాయి.‌ ఈ సమావేశాలు రెండు విధాలుగా జరిగాయి. సభ్య దేశాలతో ఒక సెషన్, ఇతర దేశాలతో రెండో సెషన్ నిర్వహించారు.

అనేక అంశాల మీద

వీటిలో ముఖ్యంగా తీవ్రవాదం, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, అఫ్ఘాన్ పరిస్థితులు, టెక్నాలజీ, ఆహార భద్రత, సప్లయి చైన్స్, ఎనర్జీ, ట్రాన్సిట్ రైట్స్, మొదలగు అంశాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా అనేక యూరోపియన్ దేశాలు రష్యాను ఒంటరిగా చేసి ఆంక్షలు విధించిన పరిస్థితి. అదే సమయంలో చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు వంటి విషయాలపై ఎస్‌సీఓ దీర్ఘంగా చర్చించింది.‌ ఇదే సందర్భంలో మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక అడుగు ముందుకేసి యుద్ధం ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వ్యక్తిగత సమావేశంలో కోరారు.

2017 నుంచి ఇండియా, పాకిస్తాన్ ఈ కూటమిలో చేరిన నాటి నుంచి సెంట్రల్ ఆసియా దేశాలు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాయి.‌ ఇది వరకు యూరోపియన్ దేశాలు ఎక్కువగా ఈ ప్రాంతంలో దృష్టి కేంద్రీకరించేవి. అయితే, రష్యా ఇటీవల కాలంలో గత రెండు దశాబ్దాలుగా చైనా మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టుల అభివృద్ధిలో పయనిస్తూ తన ఉత్పత్తులు విక్రయాలకు మార్కెట్ల అన్వేషణపై దృష్టి పెట్టింది. అలాగే ఈ సభ్య దేశాలు తమ తమ సరిహద్దులలో భద్రత కొరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

అదే ఆందోళనకరం

'ది ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్‌-ఐఎమ్‌యూ' అనే ఉగ్రవాద సంస్థ తాలిబన్‌లతో సంబంధాలు కలిగి ఉండడం ఈ ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్నది. అఫ్ఘానిస్తాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న సెంట్రల్ ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్‌, తజికిస్తాన్ తమ తమ భూభాగాలను 9/11 సంఘటన అనంతరం అమెరికా సైన్యం కోసం కేటాయించాయి.‌ అందుచేతనే ఎస్‌సీఓ 'రీజినల్ యాంటీ టెర్రరిస్టు స్ట్రక్చర్- ఆర్ఏటీఎస్' ఏర్పాటు చేసి సభ్య దేశాల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది.‌

తాష్కెంట్ ప్రధాన కార్యాలయంగా ఆర్ఏటీఎస్ పనిచేస్తుంది. దీనిలో భాగంగా 2014-15 మధ్య కాలంలో సిరియా-ఇరాక్ యుద్ధంలో అమెరికా సైన్యంతో పాటు ఎమిరేట్స్ పాల్గొన్నది. ప్రస్తుతం తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌ను పాలిస్తున్నారు. ‌ప్రస్తుతం తాలిబన్ చీఫ్‌గా క్వారీ ఫాజీద్ధున్ ఉన్నారు. ఈయన తుర్కెమినిస్తాన్‌కు చెందినవాడు. ఇదే సందర్భంలో రష్యా, చైనాల ఒత్తిడి ఎస్‌సీఓ సభ్య దేశాలకు తగలకుండా ఉండాలి.

భారత్ పాత్ర కీలకం

నాటోలో సభ్యత్వం కలిగిన దేశం టర్కీ ప్రస్తుతం ఎస్‌సీఓలో సోషల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉంది. ఇది సోషల్ డైలాగ్ పార్టనర్‌గా రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.‌ టర్కీ 2009 లో టర్కిష్ భాష మాట్లాడే భాషలతో కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈయూ/ యూఎస్ దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగిన దేశాలు ముఖ్యంగా భారత్ వంటివి ఏ దేశానికీ ఒకవైపు ఒరిగిపోకుండా నూతన శకానికి నాంది పలకాలి.‌ ప్రస్తుతం బాధ్యతలు అందిపుచ్చుకుంటున్న భారత్ పారదర్శకంగా, అన్ని దేశాల రాజకీయ ఆర్థిక, భద్రత విషయాలను దృష్టిలో ఉంచుకుని తన పాత్ర పోషించాలి.‌

మనకు చైనాకు పాకిస్తాన్‌కు ఏ రకమైన సరిహద్దు సమస్యలు ఉన్నాయో, అలాగే ఆర్మీనియా అజర్‌బైజాన్ మధ్య సమస్యలు ఉన్నాయి.‌ కావున ఎస్‌సీఓ బాధ్యతలు చేపడుతున్న భారత్ చాకచక్యంగా వ్యవహరించి, సభ్య దేశాల అభివృద్ధికి కృషి చేయాలి.‌ ఉగ్రవాదానికి ఉరి వేయాలి.‌ సభ్య దేశాల మధ్య శాంతి, సహకారంతో సప్లయి చైన్ రూపంలో ప్రపంచ దేశాలకు సరికొత్త అధ్యాయం నెలకొల్పాలి.‌ యూరోపియన్ యూనియన్ దేశాలు, రష్యా చైనా వంటి దేశాల ప్రాబల్యం మిగిలిన దేశాలపై పడకుండా స్వయంగా అభివృద్ధి పొందే దిశగా, స్వయం సాధికారత సాధించి నూతన అధ్యాయం లిఖించాలి.


ఐ.ప్రసాదరావు

63056 82733

Next Story

Most Viewed