మాజీ సైనికులపై మరణ శాసనం

by Disha edit |
మాజీ సైనికులపై మరణ శాసనం
X

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన Group IV నోటిఫికేషన్ 1920-22 తేదీ 1.12.2022లో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మాజీ సైనికులకు 40% క్వాలిఫై మార్కులు విధించింది. అదే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) లో 30% గానే ఉంది. G.O.Ms.No.55 G.A.(Ser.D) తేదీ 25.04.2022 ద్వారా కేసీఆర్ ప్రభుత్వం 40% క్వాలిఫై మార్కులు విధిస్తూ జీవో జారీ చేసి తెలంగాణ మాజీ సైనికుల ఉద్యోగాలపై మరణశాసనం రాసింది.

అర్హత కోల్పోతున్న సైనికులు..

అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో మాజీ సైనికులకు SC, ST లతో సమానంగా 30% క్వాలిఫై మార్కులు ఉండేవి. కానీ గ్రూప్-4 నోటిఫికేషన్‌లోనే క్వాలిఫై మార్కులు పెంచారు. దీంతో మాజీ సైనికులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది అయినా పెడచెవిన పెట్టారు. సైనిక సంక్షేమ అధికారి ద్వారా కూడా పలు మార్లు ప్రభుత్వానికి ఈ నిర్ణయం మాజీ సైనికులు పెద్ద ఎత్తున ఉద్యోగాలకు అర్హత కోల్పోయే విధంగా ఉందని నివేదించడం జరిగింది అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ విషయంపై కొందరు మాజీ సైనికులు హై కోర్టును ఆశ్రయించి ఆర్డర్ కాపీలు కూడా ఇవ్వడం జరిగింది అయినా ప్రస్తుత ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా గ్రూప్ lV ర్యాంక్ లిస్ట్ విడుదల చేశారు. ఇందులో కొద్ది మంది మాత్రమే 40% మార్కులకు క్వాలిఫై అయ్యారు కానీ 30% క్వాలిఫై మార్కులు అమలు చేస్తే మాజీ సైనికులందరికీ మేలు జరుగుతుంది. ఇరవై సంవత్సరాలు వివిధ ప్రదేశాలలో దేశానికి సేవ చేసిన సైనికులు మధ్య వయసులో రిటైర్డ్ అయ్యి బయట ప్రపంచం విద్యార్థులతో ఎలా పోటీ పడగలరు?

నివేదన

ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఒక్క సంతకం పెడితే అది వంద మంది మాజీ సైనికులకు ఉద్యోగాలు కల్పిస్తుంది. క్వాలిఫై మార్కులు 40% నుండి 30% కు తగ్గించాలని గత ప్రభుత్వానికి రాసిన లెటర్ నంబర్12895Ser. IVA12022 Date 02.03.2023 ఈ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంది. దీనిపై ఒక్క సంతకం చేస్తే మాజీ సైనికులకు కేటాయించిన పోస్టులకు వారు అర్హత సాధిస్తారు. గత పదేళ్ల పాలనలో ప్రభుత్వ నిర్ణయాలతో మాజీ సైనికులు అన్ని విధాలుగా నష్టపోయారు. అసైన్డ్ భూములు ఇవ్వకపోగా ఇచ్చిన వాటికి NOC ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. క్యాంటీన్లో లభించే సరుకులపై కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా టాక్స్ విధించి ఆర్థికంగా సైనికుల పొట్ట కొట్టారు. ఉద్యోగాలలో కూడా క్వాలిఫై మార్కులు 30% నుండి 40% శాతానికి పెంచి సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజానుకూల ప్రభుత్వం అని భావిస్తూ, మాజీ సైనికులకు అత్యవసరంగా Group IV లో క్వాలిఫై మార్కులు 30%నికి తగ్గించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని తెలంగాణ మాజీ సైనికులు ఆశిస్తున్నారు.

బందెల సురేందర్ రెడ్డి

మాజీ సైనికుడు

83749 72210


Next Story