ఏమౌతుందీ దేశం!

by Disha edit |
ఏమౌతుందీ దేశం!
X

దొరలు గద్దె నెక్కాక

ధరలు విపరీతంగా..పెరిగే..!

ధరణి నుండి విపణి రేట్లు

తారా స్థాయికి చేరాయి!..!

కేంద్రం పెంచెను కొంచెం

రాష్ట్రం మోపెను పెను భారం!

అధిక బరువును మోయలేక

సగటు జీవి గిలగిల !

మధ్య తరగతి ప్రాణి విలవిల !

సామాన్యుడి పరిస్థితి చూసి

మంద బుద్ధి పాలకులు మందహాసాలు..

వర్తమాన పరిపాలనలో

యువతకు ఉపాధి లేదు

నవతకు చేయూత లేదు

ఉద్యోగులకు సరిపడ జీతాలు లేవు.

వ్యవసాయ కార్మికులకు కనీస కూలీ లేదు.

పెరుగుతున్న ధరలకు

ప్రజల జీవన ప్రమాణాలు సున్న

ఏలికలు అప్పులు తెచ్చి

జనతకు ఉచితాలు!

ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచి

ప్రజలకు తాయిలాలు!

లాలన తప్ప పాలన లేని

మన దేశం ఏమౌతుందో...చివరికి..!

-జి.సూర్యనారాయణ

62817 25659



Next Story