పేరు మార్పును ప్రతిపక్షాలు స్వాగతించాలి!

by Disha edit |
పేరు మార్పును ప్రతిపక్షాలు స్వాగతించాలి!
X

పేరు మార్పును ప్రతిపక్షాలు స్వాగతించాలి!శంలో మరొక చర్చ మొదలైంది. మనదేశం పేరును ఇండియా నుంచి ‘భారత్’ ​గా మారబోతోందా? పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చ జీ-20 దేశాల ప్రతినిధులకు రాష్ట్రపతి పేరిట పంపిన ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని కేంద్రం అధికారికంగా పేర్కొనడంతో దుమారం రేగింది. భారత్ పేరుతో కూడిన ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. అయితే పేరు మార్పు అంశంపై అధికార బీజేపీ నేతలు, పలు ప్రముఖులు హర్షం వ్యక్తం చేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు తీవ్రంగా స్పందించాయి. అనే పేరునే వాడింది.అలాగే విదేశీ ప్రతినిధుల కోసం రూపొందించిన జీ-20 బుక్ లెట్ లోనూ కేంద్రం భారత్ ‘భారత్, ది మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అంటూ ఈ బుక్ లెట్‌కు టైటిల్ పెట్టడంతో పాటు అందులో ఇండియాకు బదులుగా భారత్ పేరునే పేర్కొన్నారు.

చరిత్ర ప్రకారం…

చరిత్రను గమనిస్తే, భారత్ పేరుకు మూలాలు ఋగ్వేద కాలంలోనే మొదలై నేటి రాజ్యాంగం వరకూ ఉన్నాయి. మహాభారతం, మనుస్మృతి వంటి గ్రంథాలు, పురాణాల్లోనూ భారత ప్రస్తావన ఉంది. భరత చక్రవర్తి పాలించినందున భరత ఖండం అనే పేరు వచ్చిందని మొదటి ప్రధాని నెహ్రూ కూడా తన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఇండియా, హిందుస్థాన్, భారత్ అనే పదాలపై చర్చ సందర్భంగా ప్రస్తావించారు. అయితే, మన దేశం పేరును ఇంగ్లిష్‌లో మాత్రమే ఇండియా అని పిలుస్తున్నాం. హిందీ, ఇతర భారతీయ భాషల్లో భారత్ అనే పేర్కొంటున్నాం. ద్రావిడ భాషల్లో కూడా ఇదే పదం వాడుతున్నాం. తమిళంలో భారత అని, మలయాళంలో భారతం అని, తెలుగులో భారతదేశం అని అంటున్నాం. హిందీలో రాజ్యాంగాన్ని ‘భారత్ కా సంవిధాన్’ అని పిలుస్తున్నాం. అలాగే ఆర్టికల్- 1లో ‘భారత్ అర్థాత్ ఇండియా, రాజ్యోం కా సంఘ హోగా’ అంటూ పేర్కొన్నారు. పాస్ పోర్టులపై రిపబ్లిక్ ఆఫ్ ​ఇండియా అని ఇంగ్లిష్‌లో, దానితోపాటు భారత్ గణరాజ్య అని హిందీలో రాస్తున్నా దీనిపై ఎప్పుడూ సందేహాలు తలెత్తలేదు.

మన దేశాన్ని ఏ పేరుతో పిలవాలన్న అంశాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్నారు. ఆర్టికల్ 1 డ్రాఫ్ట్ ను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1949, సెప్టెంబర్ 18న ఆమోదించింది. దేశం పేరుపై చర్చ సందర్భంగా భారత్, హిందుస్థాన్, హింద్, భారత్ భూమి, భారత్ వర్ష వంటి పేర్లతో డ్రాఫ్ట్ కమిటీ సభ్యుల నుంచి అనేక సూచనలు వచ్చాయి. కమిటీలోని కొందరు సభ్యులు భారత్ అనే పేరు పెట్టడానికి, ఇతర సభ్యులు ఇండియా అనే పేరు పెట్టేందుకు మొగ్గు చూపారు. దీంతో ఆర్టికల్ 1(1)లో పేర్కొన్న ‘ఇండియా అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది’ అన్న ప్రకటనకు కాన్​స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మన దేశాన్ని అధికారికంగా ఏ పేరుతో పిలవాలన్న దానికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఏకైక వివరణ ఇదే.

బానిసత్వ ఆనవాళ్ళు తొలగించుకునేందుకు..

ఇండియా పేరును భారత్‌గా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇదే విషయంపై గతంలో సుప్రీంకోర్టులో రెండు సార్లు పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అయితే, ఆ పిటిషన్లను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది. రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే రెండు పేర్లూ ఉన్నాయి. వీటిలో దేనినైనా అధికారికంగా వాడుకోవచ్చు. ఇందుకు ఇబ్బందేమీ లేదు. కానీ రాజ్యాంగం నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించి, భారత్ అనే పదాన్ని మాత్రమే ఉంచాలంటే మాత్రం అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని ఇందుకోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని ఇది ఆమోదించేందుకు ప్రత్యేక మెజారిటీ తప్పనిసరి. ఇందుకోసం పార్లమెంట్ ఉభయసభలకు ఓటింగ్ జరగాలి. హాజరైన మొత్తం సభ్యుల్లో కనీసం 66% ఓట్లు రావాలి.

ఇప్పటికే ప్రపంచ దేశాలు కొన్ని అక్కడి పరిస్థితులను బట్టి వారి అభిమతం మేరకు వాటి పేర్లను మార్చుకున్నాయి. వీటిల్లో నెదర్లాండ్, శ్రీలంక, ఇరాన్, బర్మా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ బానిసత్వానికి, వలస రాజ్యాలకి ప్రతీకగా ఉండకూదనే ఉద్దేశంతో వారి దేశాల పేర్లు మార్చుకున్నాయి. వాటిల్లాగే బ్రిటిష్ బానిసత్వం, దోపిడీకి గురైన మనదేశం పేరును కూడా ఇండియా నుండి భారత్ గా మార్చడంతో బానిసత్వపు ఆనవాళ్లని తొలగించుకోవచ్చు.

రాజకీయ కూటమికి.. ఆ పేరెందుకు?

అయితే ఈ పేరు మార్పుపై ప్రతిపక్షాలు మాత్రం ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే దేశం పేరు మార్పు కోసం ప్రయత్నిస్తోందంటూ విమర్శిస్తుంది.

అయితే, భారత్ అనే పదం రాజ్యాంగంలో ఉందని, దాన్ని వాడటంలో తప్పు లేదని, బానిసత్వపు ఆనవాళ్లకు గుర్తుగా ఉన్న ఇండియా అనే పదాన్ని చెరిపేయాల్సిందేనని స్పష్టం చేస్తుంది. దేశంలోని ప్రతిపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఓ కూటమి ఏర్పరచుకొని దానికి ‘ఇండియా’ కూటమి అని పేరు పెట్టుకున్నారు. అయితే ఒక రాజకీయ కూటమి సంబంధించినటువంటి పేరును ఒక దేశానికి ఆపాదించేలా పేరును తీసుకురావడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా నేడు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత “భారత్” పేరును వ్యతిరేకించడం కూడా ఎంతవరకు సమంజసం అనేది ప్రతిపక్షాలు ఆత్మ విమర్శలు చేసుకోవాలి. దేశ పేరు మార్పు ఒక రాజకీయ పార్టీకి ఒక కూటమికో, వర్గానికో చెందింది కాదని దేశానికి సంబంధించిన అంశమని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజల అభిప్రాయాన్ని సేకరించి ఇండియా పేరును భారత్‌గా మార్చే ప్రక్రియ త్వరలోనే జరుగుతుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు పలు పార్టీలు రాజకీయ నాయకులు ఈ అంశంపై రాజకీయ రంగును ఆపాదించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో ఇండియా లేదా భారత్ అనే పేర్లతో ప్రస్తావించినప్పుడు ఈ పేరు మార్పు వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు. కాబట్టి ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా చారిత్రక నేపథ్యం, జాతీయ వాదం ప్రతిబింబించేలా విపక్షాలు కూడా గుణాత్మక సూచనలు, సలహాలు ఇస్తే చాలా బాగుంటుంది. విపక్షాలు పేరు మార్పుపై రాజకీయం చేయడం మానుకోవాలి!

ప్రజలు స్వాగతిస్తున్నారు!

అయితే ఈమధ్య సామాజిక మాధ్యమాలలో ప్రజలు ఇస్తున్నటువంటి అభిప్రాయం, పలు కామెంట్లను బట్టి ఎక్కువ శాతం మంది భారత్ ను కోరుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఈ పేరు మార్పుకు కేవలం ఈ సామాజిక మాధ్యమాలే కొలమానం కానప్పటికీ కేంద్రం దేశ ప్రజల అందరి అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. నేటి ఆధునిక కాలంలో ఒక దేశానికి సంబంధించినటువంటి పరిస్థితులు, మారుతున్న ధోరణులు, ప్రజల అభిమానం మేరకు పలు మార్పులు అవసరం! ఆ దిశగా వస్తున్నటువంటి మార్పులను ప్రజలు పార్టీలు స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.!

డా. కందగట్ల శ్రవణ్ కుమార్

[email protected]

Next Story

Most Viewed