త్యాగాల పునాదుల స్ఫూర్తి

by Disha edit |
త్యాగాల పునాదుల స్ఫూర్తి
X

సాధారణ విద్యార్థులను రాజకీయాలకు అతీతంగా దేశభక్తులుగా తీర్చిదిద్దుతూ ప్రపంచ దేశాలలో గౌరవప్రద దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న క్యాడర్ బెస్ట్ మాస్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ.1949లో ఈ ఆర్గనైజేషన్ ప్రారంభం కాగా ఉమ్మడి రాష్ట్రంలో 1964 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది.కొన్ని సంవత్సరాలలోనే ఇరు ప్రాంతాల ప్రజల కడగండ్లకు ప్రత్యేక రాష్ట్ర సాధనే పరిష్కారమని 1969 నాటి తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదింది. ఈ ఉద్యమంలో అనేక మంది కార్యకర్తలు తుపాకీ గుండ్లకు బలైనప్పటీకి నాటి ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చడంలో సఫలీకృతమైంది.

ఈ ఉద్యమంలో ఇటు జై తెలంగాణ,అటు జై ఆంధ్ర ఉద్యమాలను ఏకకాలంలో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు లేకుండా అద్భుతంగా ఆవిష్కరించింది.అలాగే 1975 నాటి ఎమర్జెన్సీ రోజులలో ఎంతో మంది జైలులో మగ్గిన,కొవ్వొత్తులతో వెన్నెముక కాల్చిన ఎక్కడ వెనకడుగు వేయకుండా పోరాడారు కార్యకర్తలు.అలాగే బంగ్లాదేశ్ చొరబాటు దారులు అస్సాంను ఆవహిస్తున్న అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించి వారికి అండగా ఉండి 'సేవ్ అస్సాం టుడే-సేవ్ ఇండియా టుమారో' అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించింది.

వారి భావజాలంనకు ఎదురొడ్డి

తెలంగాణలో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలని కుట్ర పన్నిన నక్సలైట్ ఉద్యమం ఒకవైపు,మరోవైపు వారి అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ సమాజంలో, కళాశాల క్యాంపస్ లో విద్యార్థుల మనసులను మార్చి నక్సలిజం వైపు మరల్చే కుట్రలకు ఎదురొడ్డి నిలిచి వారిని కళాశాల నుండి తరిమివేసేలా,అలాగే అడవిలో నక్సలైట్లు అట్టడుగు వర్గాల సాధారణ ప్రజలను ఇన్ఫార్మర్ల పేరుతో కాల్చి చంపుతూ వారి భావజాలం సమాజంపై రుద్దాలని ప్రయత్నించిన వారికి ఎదురొడ్డి ఎంతో మంది కార్యకర్తలు అమరులయ్యారు.అలాగే నక్సలైట్లు తుపాకి చేతబూని 1980 జనవరి 26 న ఇది బూటకపు స్వాతంత్రం అని జాతీయ జెండాను అంటబెడుతుండగా వారికి ఎదురొడ్డి నిలిచి వీరమరణం పొంది జాతీయ జెండా గౌరవాన్ని కాపాడిన కార్యకర్త ఉన్న ఆర్గనైజేషన్.

అలాగే వ్యక్తి నిర్మూలన ద్వారా సమసమాజం నిర్మిద్దామనే తప్పుడు సిద్దాంతాన్ని వ్యతిరేకించి వ్యక్తుల నిర్మాణం ద్వారానే సమసమాజం ఏర్పడుతుందని నమ్మి ఏచూరి శ్రీనివాస్,కృష్ణ వర్ధన్ రెడ్డి వంటి 43 మంది ఏబీవీపీ కార్యకర్తలు నక్సలైట్ల చేతిలో బలైపోయారు.వీరెవరికి వారితో వ్యక్తిగత క్షక్షలు లేవు కేవలం అమాయక పేద విద్యార్థుల చేతికి తుపాకినిచ్చి భవిష్యత్ నాశనం చేయకుండా కాపాడమని ఎదురించినందుకే ప్రాణాలు కొల్పోయారు.ఈ ఆర్గనైజేషన్ కు దేశంలో లక్షల మంది కార్యకర్తలున్నారు.వీరు విద్యార్థుల సమస్యలను,సాంఘీక దురాచారాలను పారద్రోలి ప్రజలలో చైతన్యం తీసుకురావడం,రక్తదాన శిబిరం,ఐ క్యాంప్ నిర్వహణ వంటివి చేపడుతారు.

సమస్యల పరిష్కార కేంద్రంగా

మలి దశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా గోదావరి, కృష్ణమ్మలు మన మళ్లకు మల్లాలి అంటూ జల చైతన్య యాత్రలు,బాసర నుంచి శ్రీశైలం వరకు సస్యశ్యామల యాత్ర,నా రక్తం, నా తెలంగాణ, హరిత తెలంగాణ లాంటి నిర్మాణాత్మక ఉద్యమాలు నిర్వహించింది.మలిదశ ఉద్యమంలో 2010 జనవరిలో భారత పార్లమెంటు ప్రతిపక్ష నాయకురాలైన సుష్మాస్వరాజ్ ను తీసుకొచ్చి లక్షమంది విద్యార్థులతో 'తెలంగాణ భేరి' నిర్వహించి ఉద్యమం పట్ల దేశ ప్రజల దృష్టి కేంద్రీకరించేలా చేసింది.

ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ విద్యార్థుల సంక్షేమం కోసం,సమకాలీన సమస్యల పరిష్కార కేంద్రంగా,విద్యారంగంలో రావాల్సిన సంస్కరణల కేంద్రంగా వారిలో నైపుణ్యాలను పెంపొందించే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా,పేద విద్యార్థులలో జాతీయ భావాలు నెలకొల్పేలా,వారిలో సృజన, మెడివిజన్‌, అగ్రివిజన్‌, ఫార్మ విజన్‌, థింక్‌ ఇండియా వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఎంతోమంది కార్యకర్తల చెమట చుక్కలతో ఒక్కో ఇటుక పేర్చుతూ, పూర్వ కార్యకర్తలు, అధ్యాపకులు, కళాశాల విద్యార్థుల పైసా పైసా విరాళాలతో 'స్ఫూర్తి-ఛాత్ర శక్తి భవన్' నిర్మితమైంది.ఇది దేశంలో, ప్రపంచంలో నడుస్తున్న సమకాలీన అంశాలపై చర్చలకు వేదిక కాబోతుంది.దీనిని నేడు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చాలక్ డా.మోహన్‌ భగవత్ నేడు సమాజానికి అంకితం చేయనున్నారు.


డా. మూసాది బాపు రావు

ఏబీవీపీ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు

Next Story

Most Viewed