ఇదీ సంగతి: అవస్థలలో దేశ ఆర్థిక వ్యవస్థ

by Disha edit |
ఇదీ సంగతి: అవస్థలలో దేశ ఆర్థిక వ్యవస్థ
X

నిజానికి ఇప్పటి వరకు 1,32,036 కోట్లు మాత్రమే రికవరీ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అసలు వే ఆఫ్ ఎందుకు? ఎవరెవరికి చేసినట్లు? ఎందుకు చేసినట్లు? చెప్పడం లేదు. డిఫాల్టర్స్ అంటారు. డిఫాల్టర్స్‌కు కూడా పదే పదే రుణాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకు? ఎలా డిఫాల్టర్స్‌కు రుణాలు ఇచ్చారు? తెలియదు, ఏం చేసినా ఎన్‌పీ‌ఏ తక్కువగా చూపితే చాలు, అధికార పార్టీ అండ దండలు ఉంటే చాలు 'బారా ఖున్ మాఫ్' అనే ధైర్యం ఉంటోంది. ఇదంతా వెరసి రాష్ట్రాల మీద కూడా ప్రభావం పడుతున్నది. బ్యాంకులో డబ్బు డిపాజిట్ మీద వడ్డీ తగ్గిస్తున్నారు, ఋణంపై వడ్డీ పెంచేస్తున్నారు. హౌసింగ్ తదితర రుణాల పరిస్థితి ఇంతే ఉంది. ధరలు అదుపులో లేవు. అదుపులో పెట్టే పరిస్థితి లేదు. 12 శాతం రిటర్న్ ఆఫ్ ఉంది. బుక్కు మీద ఎన్‌పీ‌ఏ తక్కువ చూపుతున్నారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినా పాలకులకు పట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారి కేంద్రం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే రెడ్ కార్పెట్‌ను ఒక్కసారి తొలగిద్దాం. ఆత్మ నిర్భర్ నినాదంతో కార్పొరేట్‌లకు దేశం సొత్తును ఎలా ధారాదత్తం చేస్తున్నారో చూద్దాం. కేవలం ఐదు సంవత్సరాలలోనే కార్పొరేట్‌లకు కేంద్రం 10 లక్షల 9,510 కోట్ల రూపాయలు బ్యాంక్ రుణాలు మాఫీ చేసింది. బ్యాంకులలో ఎన్‌పీ‌ఏలను తక్కువగా చూపడానికి రికార్డులు మాయం చేస్తున్నారు. నోట్లు ప్రింట్ చేసుకోమని ఆర్‌బీ‌ఐకి చెబుతున్నారు.

నిజానికి గడచిన పదేండ్లలో 13 లక్షల 22,309 కోట్ల రూపాయలను రిటర్న్ ఆఫ్(Return off) చేయగా, కేవలం ఎనిమిదేండ్లలోనే 12 లక్షల 45,000 కోట్లను రిటర్న్ ఆఫ్ చేసారు. 2012-13, 2013-14 లో 75,027 కోట్ల మేరకు రిటర్న్ ఆఫ్ జరిగింది. 2015లో 58,000 కోట్లు, 2016 లో 70 వేల కోట్లు, 2017 లో 1 లక్ష 8 వేల కోట్లు, 2018లో 1 లక్ష 71 వేల కోట్లు, ఇలా వరుసగా 1,76,000 కోట్లు, 2,36,000 కోట్లు, 2,34,000 కోట్లు, 2,00,000 కోట్లు, 1,74,000 కోట్లు కార్పొరేట్‌లకు రుణ మాఫీ చేసారు.

రికవరీ చాలా తక్కువ

నిజానికి ఇప్పటి వరకు 1,32,036 కోట్లు మాత్రమే రికవరీ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అసలు వే ఆఫ్ (waive off) ఎందుకు? ఎవరెవరికి చేసినట్లు? ఎందుకు చేసినట్లు? చెప్పడం లేదు. డిఫాల్టర్స్ అంటారు. డిఫాల్టర్స్‌కు కూడా పదే పదే రుణాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకు? ఎలా డిఫాల్టర్స్‌కు రుణాలు ఇచ్చారు? తెలియదు, ఏం చేసినా ఎన్‌పీ‌ఏ తక్కువగా చూపితే చాలు, అధికార పార్టీ అండ దండలు ఉంటే చాలు 'బారా ఖున్ మాఫ్' అనే ధైర్యం ఉంటోంది. ఇదంతా వెరసి రాష్ట్రాల మీద కూడా ప్రభావం పడుతున్నది. బ్యాంకులో డబ్బు డిపాజిట్ మీద వడ్డీ తగ్గిస్తున్నారు, ఋణంపై వడ్డీ పెంచేస్తున్నారు. హౌసింగ్ తదితర రుణాల పరిస్థితి ఇంతే ఉంది. ధరలు అదుపులో లేవు. అదుపులో పెట్టే పరిస్థితి లేదు. 12 శాతం రిటర్న్ ఆఫ్ ఉంది. బుక్కు మీద ఎన్‌పీ‌ఏ(NPA) తక్కువ చూపుతున్నారు. ఎనిమిదేండ్లలో డిఫాల్టర్స్ (Bank defaulters) సంఖ్య 2,964కు పెరిగింది.

నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వారు మాత్రమే కాదు. ఇందులో అదానీ, అంబానీ లాంటి వారూ ఉన్నారు. బిజినెస్ హెడ్ క్వార్టర్స్ విదేశాలలో పెట్టుకున్న స్వదేశీలూ ఉన్నారు. గీతాంజలి, ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీఐ, బ్యాంకు అఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు ఇలా చాలా బ్యాంక్‌లకు కార్పొరేట్‌లు రుణాలు ఎగ్గొట్టారు. అదో చాలా పెద్ద చాంతాడు అంత జాబితా ఉంది. ఇందులో ఎక్కువ శాతం గుజరాత్‌కు చెందిన వారే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్నికలు, అధికారం ఒక్కటే పరమావధిగా మారింది. ఎన్నికలలో గెలవడం కోసం విపక్షాలను ఐటి, ఈడీ, సీబీఐ దాడులతో పరేషాన్ చేయడం కేంద్రం ఇప్పుడు ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. పబ్లిక్‌లో విపక్షాలను ఎలా బద్‌నామ్ చేయాలా అని చూస్తున్నారు. తెలంగాణలోనూ ఇప్పుడు ఇదే జరుగుతున్నది.

Also read: వారే దేశానికి ఆర్థిక సహాయం చేసేలా పరిస్థితి ఉందా?

వీటికి జవాబు చెప్పేదెవరు?

బ్యాంకుల లూట్‌మార్ ఇంత బాహాటంగా జరుగుతున్నా, రుణమాఫీలు చేసి కార్పొరేట్‌లకు, పారిశ్రామిక వేత్తలకు మద్దతు ఇస్తున్న బీజేపీ పెద్దలను ఏమనాలి? కొద్ది మంది వెసులుబాటు కోసం ఇలా ప్రజా ధనాన్ని ధారాదత్తం చేయడానికేనా రెండుసార్లు అధికారం ఇచ్చింది. చెప్పండి. నల్లధనం వెలికి తీస్తామని, అందరికి ఖాతాలలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారు. నోట్ల రద్దు లాంటి చర్యలకు పూనుకొని 80 కోట్ల మంది పేదలను రోడ్ల మీదికి తెచ్చారు. ఉపాధి లేకుండా చేసి ప్రభుత్వం తాత్కాలికంగా ఎన్నికలలో గెలువడానికి ఇస్తున్న ఐదు కేజీల బియ్యం, గోధుమల మీద ఆధారపడి జీవించే పరిస్థితి తెచ్చారు. దేశాన్ని అప్పుల పాలు చేశారు. కుటుంబాలు ఆగం అవుతున్నాయి.

యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు. కనీసం ఎనిమిదేండ్లలో పది లక్షల ఉద్యోగాలు లేవు. ఇప్పటికైనా కేంద్రం ఒక వైట్ పేపర్ విడుదల చేయాలి. ఎవరికి? ఎంత? రుణమాఫీ ఇచ్చారో వెల్లడించాలి. లక్షల కోట్ల 2000 రూపాయల నోట్లు కనిపిస్తలేవంటున్నారు. అవి ఎక్కడకు పోయాయి? ఎవరు దాచారు? స్విస్ బ్యాంక్‌లలో మన వారి డిపాజిట్‌లు 10 వేల కోట్లు పెరిగాయంటున్నారు. విదేశాలలో ఇక్కడి డిఫాల్టర్స్ వ్యాపారాలు చేసుకొంటున్నారు. వారి సంగతి ఎప్పుడు చూస్తారు? దేశంలో 150 కోట్ల రూపాయలతో ప్రారంభించిన 380 ప్రాజెక్ట్‌ల మీద పెట్టుబడి ఇప్పుడు 4,98,000 కోట్లకు పెరిగిందంటున్నారు ఎందుకు? ఎలా? జవాబుదారీతనం లేదా?

Also read: దేశం అన్నింటా వెనుకబాటే


ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Next Story