విధి ఎంత విచిత్రమో..

by Ravi |
విధి ఎంత విచిత్రమో..
X

74 ఏళ్ల చంద్రబాబు, 73 ఏళ్ల నితీష్ కుమార్‌ల రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయినట్టు అనిపించింది. కానీ కాలం ఇద్దరికీ గొప్ప అవకాశం ఇచ్చింది. ఈ ఇద్దరూ కలిసి ఎవరికేసి చేయి చూపితే...ఆయనే ప్రధాని కాగల పరిస్థితి ఏర్పడింది..! సరిగ్గా కొన్ని నెలల క్రితం జరిగిన ఘటనను చూద్దాం.... చంద్రబాబు ఆ మధ్య ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవడానికి సమయం అడిగితే డేట్ ఇవ్వలేనని చెప్పి ఘోరంగా అవమానించారు. దాంతో చంద్రబాబు తీవ్ర నిరాశతో, బరువెక్కిన హృదయంతో వెనుదిరిగారు. కానీ ఏ చంద్రబాబును అవమానించి ఆనాడు తరిమికొట్టారో... అదే చంద్రబాబు మద్దతుపైనే ఈరోజు బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా ఆధారపడాల్సి వచ్చింది. మోడీకి బాబు సపోర్ట్ కావాలి...! ఆయన మద్దతు ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. కాబట్టే ప్రధానిని కలవడానికి తేదీ, స్థలాన్ని ప్రకటిస్తూ బాబు మద్దతు లేఖ కోసం బీజేపీ అధిష్టానం వేచి ఉండాల్సిన పరిస్థితి తన్నుకొచ్చింది. కాలం ఎంత విచిత్రమైనదో కదా... అందుకే, ఎవ్వరూ ఏ వయసులోనైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు అంతా అయిపోయింది అనే ఆశను కోల్పోవలసిన అవసరం లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఊరకే అనలేదు కదా..

- రమణాచారి

99898 63039

Next Story

Most Viewed