- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
అంతర్జాతీయ కాఫీ దినోత్సవం వెనక విశేషాలు
అనుదిన్నమ్మును కాఫీయే అసలు కిక్కు కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కూ కప్పు కాఫీ లబించుటే గొప్ప లక్కూ అమృతమన్నది హంబక్కు అయ్యలారా అని దందకాలు వ్రాశారు సినీ కవులు.. వాన కురిసినా.. ఫ్రెండ్స్‌తో గాసిప్ టైం అయినా అంతెందుకు పొద్దున లేవగానే మన బుర్రలో వచ్చే ఏకైక థాట్ కాఫీ ఫ్రెష్‌గా వేడి వేడి కాఫీ పడందే రోజు మొదలుకాదు .ఒత్తిడి నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే కాఫీ కావాల్సిందే. ఒక కప్పు కాఫీ మీ ఇంద్రియాలను ఉత్తేజితం చేస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కువసేపు పనిచేసినా..కాఫీ తోనే ఉపశమనం దక్కుతుంది. శతాబ్దాల నుంచి అందుబాటులో ఉన్న కాఫీ కాస్త చేదు, తీపి మిక్సింగ్‌తో ఉంటుంది . అయితే చాలమండి కాఫీ ప్రియులకి తెలియని విషయం ప్రతి ఏటా అక్టోబర్ 1న అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని జరుపుకుంటా రని మొదటిసారిగా, 2015 లో అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతర్జాతీయ కాఫీ సంస్థ (ICO) 2014 లో కాఫీ ప్రియులందరికీ ఆ రోజును అంకితం చేయాలని నిర్ణయించుకుంది.మొదటి అధికారిక కాఫీ డే 2015 లో మిలన్‌లో ప్రారంభించబడింది.
అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ప్రాముఖ్యత
కాఫీ వ్యాపారం, ఎగుమతులు,దిగుమతులను ప్రోత్సహించడం..ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ సాగు చేసే రైతుల కష్టనష్టాలను వెలుగులోకి తీసుకురావడం కూడా ఈ రోజు ఉద్దేశ్యంగా కొనసాగుతోంది. సుగంధాలు వెదజల్లే ఈ పంట గురించి జ్ఞానాన్ని పొందడం మరియు వాటి నుండి తయారు చేసిన వివిధ రకాల కాఫీలు మరియు వంటకాలను ప్రయత్నించడం ద్వారా రోజును జరుపుకోవడానికి ఈ అంతర్జాతీయ కాఫీ డే ఓ వేదిక..
కాఫీ పుట్టుక వెనుక కథలు..
ప్రపంచంలో ఎంతో మందిని తన రుచితో కట్టిపడేస్తున్న కాఫీ పుట్టుకకి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. యూఎస్ లోని నేషనల్ కాఫీ అసోసియేషన్ ప్రకారం...కాఫీ ప్రపథమంగా ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలోపుట్టింది. అక్కడి నుంచే ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. ఈ ప్రాంతంలోని ఓరోమె తెగకు చెందిన పూర్వీకులు మొదటిసారిగా కాఫీని గుర్తించారు. కాలక్రమంలో ఈ కాఫీ ఇధియోపియా నుంచి అరేబియాకి చేరుకుంది. కాప్ఫే అనే జాతికి చెందిన మొక్క గింజల నుంచి తయారుకావడంతో ఈ పానీయానికి కాఫీ అనే పేరు వచ్చింది అని తెలిపింది. భారతదేశానికి కాఫీ ఎలా వచ్చిందనే చరిత్రను పరిశీలిస్తే 16వ శతాబ్దంలో సూఫీ సన్యాసి బాబా బూదాన్ ఏడు కాఫీ గింజల్ని అరేబియా నుంచి, భారతదేశానికి తీసుకువచ్చారనీ, వాటిని కర్ణాటకలోని చిగ్‌మగళూర్‌లో తన ఆశ్రమంలో నాటారనీ ప్రస్తావించారు. అక్కడ నుంచి వ్యాప్తి చెంది భారతదేశంలో పలు ప్రాంతాలకి కాఫీ పంట విస్తరించిందని ఆ కథనం తెలిపింది. అలా ఇథియోపియాలో మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచమంతా విస్తరించి...ఇప్పుడు 75 దేశాల్లో వాణిజ్య పంటగా పండుతోంది.
భారతదేశంలో అరకు కాఫీ టాప్ బ్రాండ్స్ లో ఒకటి.
వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఇది కాఫీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు.. తాము సంప్రదాయ పద్ధతులోల చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయించారు. వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీనగర్, మినుమలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు . స్వాతంత్ర్యం అనంతరం ఏర్పాటైన గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 1960 నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది.
సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ...పొడవాటి మిరియాలు, సిల్వర్ ఓక్ చెట్ల మధ్యలో సాగవుతాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీని వలన చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది ప్రపంచంలో కాఫీని అధికంగా పండించే దేశాల్లో భారతదేశానిది ఏడో స్థానం ఇండియా మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులతో ఏడవ స్థానంలో ఉంది. భారతదేశంలో... 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుండగా... అందులో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఉంటుంది..
కాఫీ తాగితే మంచిదేనా కాఫీ తాగడం వల్ల పార్కిన్ సన్స్ వ్యాధి (నరాల సమస్య) ముప్పును తగ్గించుకోవచ్చని మరో పరిశోధన తేల్చింది. అలాగని ఎక్కువ కాఫీ తాగితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాఫీ తాగిన వెంటనే మెదడు ఉత్తేజమవుతుంది. శరీరమంతా ఉత్సహంగా ఉంటుంది మోతాదు మించకుండా తాగితే ఏదైనా మంచిదే. అలాగే కాఫీ కూడా. తాజా అధ్యయనం ప్రకారం కాఫీ మితంగా అంటే రోజుకు రెండు కప్పులు మించకుండా తాగితే గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు రావు.
తెల్లవాడి టౌను నుంచి తెలుగువాడి వీధి దాక కప్పు కాఫి తగలకుంటె కాలమైన ఆగిపోదా లోకమంత వేరు వేరు పేరు పెట్టి పిలుచుకున్నదీని కిక్కి ఎక్కడైన ఒక్కటేరా తెలుసుకోరా ఒక్క సిప్పు కాఫి లోన ఎంతో మజా ఉందిరా ఆంటూ కేరింతలు కొట్టించిన ద్వి అక్షర పానీయం కాఫీ.
శ్రీధర్ వాడవల్లి
99898 55445