డా. గజ్జల రామేశ్వరంకు 'కీర్తి పురస్కారం"

by Disha edit |
డా. గజ్జల రామేశ్వరంకు కీర్తి పురస్కారం
X

అరుదైన ప్రకృతి వైద్య, ఆరోగ్యం శాస్త్ర గ్రంథాలయం స్థాపకులు, కాకతీయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ పాలన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు డాక్టర్. గజ్జల రామేశ్వరం గారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,హైదరాబాదు వారు, పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారి స్మారక అవార్డుతో కీర్తి పురస్కారం ప్రకటించారు. ఈ అవార్డును ఈ నెల 29వ తేదీన స్వీకరిస్తారు.

మహబూబాబాద్ జిల్లాలో కురవి గ్రామంలో, గజ్జల బాలయ్య,నాగమ్మ దంపతులకు 1956 సెప్టెంబర్ 5న జన్మించారు. బాలయ్య గారు కురవి ప్రభుత్వ పాఠశాలలో ప్యూన్ గా పనిచేసిన ఆయన కురవి గ్రామంలో మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగి. డా.రామేశ్వరం హైస్కూల్ విద్య వరకు కురవి గ్రామంలోను,ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, బి.ఏ డిగ్రీని, కె.ఆర్.ఆర్.కళాశాల, నల్గొండ జిల్లా, కోదాడ పూర్తి చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (1976-78), పి.హెచ్.డి.(1988) కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్ లో (ప్రభుత్వ పాలనాశాస్త్రంలో)పూర్తి చేశారు. ఈ సమయంలో నే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్,సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు కూడా పొందారు. ప్రొఫెసర్ అమృతరావు పర్యవేక్షణలో గ్రామీణ ప్రాంతాలలో వైద్య, ఆరోగ్య పాలనపై పరిశోధన చేసి, డాక్టరేట్ సాధించారు. అదే విశ్వవిద్యాలయంలో1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి, 2008 ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది, 2016లో, పదవీ విరమణ పొందారు.

ఆయనకు 1998లో న్యూఢిల్లీలో, మహాత్మాగాంధీ అండ్ నేచురోపతి జాతీయ సదస్సులో 50 సంవత్సరాల ప్రభుత్వ వైద్య,ఆరోగ్య విధానాలు, పథకాలు అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించినందుకు గాను సదస్సు నిర్వాహకుల నుండి బ్రాంజ్ మెడల్, ప్రకృతి వైద్య ,ఆరోగ్య శాస్త్రానికి సంబంధించిన, అరుదైన సాహిత్యాన్ని సేకరించినందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు 2016లో, 25 డిసెంబర్ 2022న వాజ్‌పేయి ఫౌండేషన్ వారి ప్రతిభ పురస్కారం లభించాయి. ఇప్పటి వరకు ఆయన ప్రకృతి వైద్య శాస్త్రంపై 5 పుస్తకాలు రాశారు. ఆరోగ్య సాధనం అనే మాస పత్రికను నడుపుతున్నారు.


Next Story

Most Viewed