అమ్మ యాదిలో...

by Disha edit |
అమ్మ యాదిలో...
X

దాదాపు 13 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఉద్యమ పార్టీ, పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతే ఎవరు చేస్తారు, ఒక్కసారి అయినా ఆలోచించారా? వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులకు తిండి పెట్టాలి, ఫోటోలతో కడుపు నిండదు అని..

నిన్ను ఏమడిగారు అధికారికంగా ఉన్న నామినేటెడ్ పోస్టులే కదా? ఒక ప్రభుత్వం అధికారం వచ్చినంక రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు దాదాపు నూట ఎనిమిది కార్పొరేషన్లు ఉంటాయి, రెండేళ్లు ఒక టర్మ్ అనుకున్నా, ఈ పది సంవత్సరాలలో దాదాపు 540 మంది లీడర్‌లు ఛైర్మన్‌లుగా అవుతుండే, వాళ్ళ కిందా కనీసం 5 గురిని డైరెక్టర్‌లుగా గాని మెంబెర్స్‌గా గానీ వేస్తే దాదాపుగా 3000 వేల మంది కార్యకర్తలకు పదవులు వస్తుండే, ఈ పదవులు కొత్తగా పుట్టించినవి కాదు ప్రతి ప్రభుత్వంలో ఉన్న పదవులే కదా, ఇవి ఇచ్చుంటే, పార్టీ నాలుగు దిక్కులా బలంగా ఉంటుండే, పార్టీ మమ్మల్ని గుర్తించింది అని అందరు ఇంకా కసితోని పని చేస్తుండేకదా, మీరు అలా చేసుంటే ఇప్పుడూ ఈ ఫలితం ఉండకపోతుండే కదా రామన్న..

ఇచ్చినోనికే మూడు నాలుగు సార్లు పదవి ఇస్తిరి వాడితోని నాలుగు ఓట్లు పడకపాయే, కార్యకర్తలను బిచ్చగాల్లకంటే అధ్వాన్నంగా చూస్తిరి, ఎవ్వనికి ఒక్క పని చేయకపోతిరి, ఫోటోలు దిగి పంపిస్తిరి, ఫోటోలుంటే కడుపు నిండదు కదా అన్న, ఇప్పుడు ఎందుకు ఇదంత చెపుతున్నానంటే నిజంగా ఏదైనా ఒక చిన్న విజిటింగ్ కార్డ్ మందం పదవీ వచ్చినా మా అమ్మ ఒక సంవత్సరం ఎక్కువ బ్రతికేది. తండ్రి గౌరవం ఇచ్చేవాడు.. అమ్మ 2018లో కాలం చేసింది. అప్పటికి మన ప్రభుత్వం వచ్చి దాదాపు అయిదేళ్ళు అయ్యింది, ఇప్పుడు పదేండ్ల యినా అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు కుటుంబం, దోస్తులు, చుట్టాలు, ఊరూ వాడా అందరూ మిమ్మల్ని పార్టీ మోసం చేసిందీ, వాడుకొని వొదిలేసింది అంటే ఎవరూ తట్టుకోలేకపోతున్నం. ఎంతోమంది విద్యార్థి నాయకుల, కార్యకర్తల తల్లీదండ్రుల ఆవేదన ఇదే..

ఏ తల్లి అయినా తన పిల్లల ఎదుగుదలను, సక్సస్‌ను తాము బతికి ఉన్నప్పుడే కళ్లనిండా చూడాలనుకుంటారు, అలా చూస్తే వారి ఆనందం ఆయుష్షు పెరుగుతది, కానీ ఇప్పుడు ఎదిగినా చూడటానికి మా అమ్మ లేదు నానమ్మ లేదు రామన్న..

రూశం బాలు

-ఫేస్‌బుక్ నుండి సేకరణ

Next Story