ఆదివాసీల ఆత్మనివేదన

by Disha edit |
ఆదివాసీల ఆత్మనివేదన
X

మేడారం తల్లులకు శతకోటి వందనాలు

సమ్మక్క తల్లీ... మేం మీ వారసులం!

మన జాతిని కళ్ళార్పకుండా చూడండి

రెండేళ్ల కొకసారి వస్తున్నరు కదా ...

మా అస్తిత్వం జాడ తెలపండి.

మనుగడ కోసం మా పెనుగులాట ఏమిటి ?

తెలంగాణ కూడా వచ్చి పదేళ్లయింది

ఇంకా వెదుకుతున్నాం

మీ వీరత్వానికి చోటేదని!

మా ఆస్తిత్వ జాడేదని!

ఆసియాలోనే మీరు గొప్పని ప్రచారం చేస్తున్నరు

కాని రాష్ట్రంలో సరైన గుర్తింపే లేదు

జాతరప్పుడే కోయదొరలు గుర్తొస్తున్నరు

తర్వాత గిరిజనుల్లో మీరు ఒకరని వదిలేస్తున్నరు !

అందుకే..

ఆదివాసీలే అసలైన గిరిజనులమని చెప్పండి

అడవిపై మాకే అధికారమియ్యమని ఆదేశించండి

వీరత్వం, ధీరత్వం, దైవత్వానికి వారసులమని చెప్పండి.

మీ రూపాన్ని, సంస్కృతిని మార్చి

దండుకుంటున్న నయవంచకులను నివారించండి !

మన (వన)జాతికి సరైన సామాజిక

గుర్తింపేదని నిలదీయండి.

చట్టసభలలో అన్యాక్రాంతమైన మీ సీట్లు

ఇవేనని ఖాళీ చూపించండి

కోల్పోయిన కొలువులు తిరిగి ఇప్పించేయండి

చిలకల గుట్ట నుండి...ఒక్క చిటికేసి

మీ సన్నిధికి వచ్చిన వారందరూ మీ బిడ్డలేనని

దీవిస్తూ...చక్కగా పరిపాలించమని

పాలకులకి చెప్పి వెళ్ళండి తల్లీ !

సమ్మక్క, సారక్క, పగిడిద్ద రాజు, జంపన్న, గోవిందరాజు, నాగులమ్మలకు వీడ్కోలు ....

(నేడు మేడారం దేవతల వనప్రవేశం సందర్బంగా...)

గుమ్మడి లక్ష్మీనారాయణ,

ఆదివాసీ రచయితల వేదిక,

94913 18409



Next Story

Most Viewed