ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల్లో రూ. 9,371 కోట్లు బ్యాంకులకు బదిలీ..

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 18,170 కోట్ల విలువైన ఆస్తుల్లో రూ. 9,371 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పలు ప్రభుత్వ బ్యాంకులకు, కేంద్రానికి బదిలీ చేసినట్టు వెల్లడించింది.ఈ ఆస్తులలో నకిలీ కంపెనీలు, ట్రస్టులు, బినామీలు, బంధువుల పేర్ల రూపంలో ఉన్నట్టు ఈడీ తన దర్యాప్తులో తేల్చింది. ఈ ముగ్గురి వల్ల బ్యాంకులకు మొత్తం రూ. 22,585.83 కోట్ల నష్టం వాటిల్లింది.

బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఈ ఆర్థిక నేరగాళ్ల స్థిరాస్తుల నుంచి ఈడీ రూ. 18,170.02 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో రూ. 969 కోట్ల విలువైన విదేశీ కూడా ఉన్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. వీరు బ్యాంకులను మోసం చేసిన మొత్తం సొమ్ము నుంచి 80.45 శాతం వరకు సీజ్ చేశామని, రుణాలు, పన్నుల ఎగవేతకు సంబంధించి ఈడీ, ఆదాయపు పన్ను, సీబీఐ సంస్థల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. వీరి ఆస్తులను త్వరలో వేలం వేయనున్నామని, అనంతరం అందులోంచి సంబంధిత బ్యాంకులకు దాదాపు రూ.7,981 కోట్లు జమవుతాయని ఈడీ వివరించింది. అలాగే, ఈ ముగ్గురిని భారత్‌కు తిరిగి రప్పించేందుకు ఈ ప్రయత్నిస్తోందని, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం.. దర్యాప్తు పూర్తవగానే వీరిని భారత్‌కు అప్పగించాలని లండన్, యాంటిగ్రా, బార్బుడా దేశాలను ఈడీ విజ్ఞప్తి చేసింది.


Next Story