హీరోయిన్‌ కు ఈడీ సమన్లు.. విచారణకు డెడ్ లైన్

by  |
yami gowtham news
X

దిశ, సినిమా : హీరోయిన్ యామీ గౌతమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద జరిగిన అవకతవకలకు సంబంధించి తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసేందుకు వచ్చే వారం ఈడీ ముందు హాజరుకావాలని సూచించింది. రూ .1.5 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యంపై విచారణ జరగనున్నట్లు సీనియర్ ఈడీ అధికారి తెలిపారు. కాగా యామీ గౌతమ్.. ఈ మధ్యే డైరెక్టర్ ఆదిత్యా ధర్‌ను పెళ్లి చేసుకుంది. కొవిడ్ ప్రొటోకాల్స్ అనుసరిస్తూ జూన్ 4న వీరి పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది యామీ.

Next Story