అర్థరాత్రి భూ ప్రకంపనలు

by  |
అర్థరాత్రి  భూ ప్రకంపనలు
X

దిశ, వెబ్ డెస్క్ :
పంజాబ్‌ రాష్ట్రంలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. పంజాబ్‌లోని టర్న్‌ తరన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1 మాగ్నిట్యూడ్‌గా నమోదైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత తక్కువగా నమోదవ్వడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. కాగా, గత కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు..మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, లఢఖ్ వంటి ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. వీటి తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిళ్లడం లేదని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed