రూల్స్‌ బ్రేక్‌ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు !

by  |
రూల్స్‌ బ్రేక్‌ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు !
X

దిశ, వెబ్‌డెస్క్: వాహన నిబంధన ఉల్లంఘన జరిమానాలను భారీగా పెంచుతూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బైక్‌ల నుంచి 7సీటర్ కార్ల వరకు ఒక కేటగిరిగా జరిమానాలు, భారీ వాహనాలకు మరో కేటగిరిగా జరిమానాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల చెకింగ్‌ విధులకు ఆటంకం కలిగిస్తే రూ.750, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.వెయ్యి, అనవసరంగా హారన్ మోగిస్తే ఫస్ట్ టైం రూ.వెయ్యి, రెండోసారి రూ.2వేలు జరిమనాను విధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన తయారీదారు, డీలరు, దిగుమతి దారుకు రూ.లక్ష జరిమనా, నిబంధనలు పలుసార్లు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10వేలు, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5వేలు, రెండోసారికి రూ.10వేలు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5వేలు, పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20వేల జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story