భలే డాక్టర్.. ఏకంగా అక్కడే ఆటోగ్రాఫ్ ఇచ్చేశాడు

166

దిశ, వెబ్‌డెస్క్ : ఆటోగ్రాఫ్ అది ఓ మర్చిపోలేని మెమోరీ. ఈ ఆటోగ్రాఫ్ మనకు ఇష్టమైనవారి నుంచి గుర్తుగా తీసుకుంటాం. ఎక్కువ బుక్స్, పేపర్స్‌పై ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా లివర్‌పై ఆటోగ్రాఫ్ తీసుకుంటారా..! అంతేకాకుండా లివర్‌పై ఆటో గ్రాఫ్ ఇవ్వడానికి ఒప్పుకుంటారా.. ? కానీ బ్రిటన్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ సైమన్ నిర్వాకం అందరిని షాకింగ్‌కు గురి చేసింది. కాలేయ మార్పిడి కోసం వచ్చిన మహిళకు డాక్టర్ సైమన్ ఆపరేషన్ చేశాడు, అంతటితో ఆగకుండా పేషెంట్ లివర్‌పై 1.6 అంగుళాల సైజులో ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అయితే అనతరం పేషెంట్‌ ఆనారోగ్యం పాలుకావడం మరోసారి వేరే ఆసుపత్రిలో చేరింది. దీంతో మహిళను పరీక్షించిన మరో డాక్టర్ షాక్ తిన్నాడు. లివర్‌పై 1.6 అంగుళాల సైజులో అక్షరాలు గుర్తించడంతో సైమన్ నిర్వాకం బయటపడింది. అయితే 2013లో జరిగిన ఈ సంఘటనపై ట్రైబ్యునల్ తీర్పుతో తాజాగా సంచలనమైంది. ఆర్గాన్ బీమ్ మెషీన్‌ను ఉపయోగించి పేషెంట్ లివర్‌పై ఆటోగ్రాఫ్ చెక్కినట్లు డాక్టర్ సైమన్ అంగీకరించాడు. దీంతో ఆయనకు కోర్టు సస్పెన్షన్ విధించి వైద్య వృత్తి నిర్వహించకూడదని తెలిపింది.