61 మంది విద్యార్థులకు పాజిటివ్.. భయపడాల్సిన పని లేదన్న ‘చల్మెడ’ హాస్పిటల్ చైర్మన్

by  |
61 మంది విద్యార్థులకు పాజిటివ్.. భయపడాల్సిన పని లేదన్న ‘చల్మెడ’ హాస్పిటల్ చైర్మన్
X

దిశ, కరీంనగర్ సిటీ : కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తమ ఆస్పత్రి కళాశాలలో వైద్య సిబ్బందికి, విద్యార్థులకు, బోధకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చల్మెడ వైద్య కళాశాల చైర్మన్ లక్ష్మీ నరసింహారావు తెలిపారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ కళాశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకలతోనే వైరస్ వ్యాప్తి చెందినట్టు ప్రసార మాద్యమాల్లో రావటం బాధాకరమని, కళాశాలలో విద్యార్థులు వేర్వేరు ప్రాంతాల్లో వివాహాలు, విందు లకు హాజరై వచ్చారన్నారు.

అలాగే ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు వచ్చే రోగులతో కూడా ఆస్పత్రి కళాశాల ప్రాంగణంలో కోవిడ్ వ్యాప్తి చెందినట్లు ఆయన వెల్లడించారు. సెకండ్ వేవ్‌లో ఉన్న తీవ్రత ప్రస్తుతం లేకపోవడం, నిరంతరం వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా ప్రజలు కరోనా వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదన్నారు. కళాశాలలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో 41 మంది కరీంనగర్ విద్యార్థులకు, 20 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. ఇప్పటివరకు 500 మందికి పైగా విద్యార్థులకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిన వారిని మాత్రం హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు.


Next Story