నిమ్మగడ్డ వద్దండి : రిటైర్డ్ ఐజీ

by  |
నిమ్మగడ్డ వద్దండి : రిటైర్డ్ ఐజీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించవద్దని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు విశ్రాంత ఐజీ డాక్టర్‌ ఆలూరి సుందర్‌కుమార్‌ దాస్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఈ–మెయిల్‌ ద్వారా గవర్నర్‌కు వినతిపత్రం పంపారు. ఇందులో ఎస్ఈసీగా మంత్రిమండలి సిఫారసు మేరకు కాకుండా రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారం గవర్నర్‌ తన విచక్షణాధికారం మేరకు మాత్రమే నియమించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ నియామకం రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారం జరగలేదని అన్నారు.

హైకోర్టు తీర్పు ప్రకారం.. ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌–200 కింద నియమితుడైన ఎన్నికల కమిషనర్‌.. మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియను చేపట్టలేరని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన తెలిపారు. నిబంధనల మేరకు నిమ్మగడ్డ రమేశ్‌ నియామకం జరగనందున ఆయనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకమని ఆయన ఈ లేఖలో స్పష్టం చేశారు.

Next Story

Most Viewed