అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్ : ట్రంప్

by  |
అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్ : ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ అక్టోబర్ నాటికి అందుబాటులో ఉండనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం వందల బిలియన్ల వ్యయంతో వేగంగా తీసుకొస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నామని, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలను తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ కోసం సంవత్సరాల సమయం పడుతుందని, అయితే తాము 2021 జనవరిలో పంపిణీ చేయడానికి వ్యాక్సిన్ మోతాదులను సిద్ధం చేస్తున్నామని ట్రంప్ వెల్లడించారు.

అయితే, ట్రంప్ వ్యాక్సిన్ ప్రకటనపై డెమోక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిష్ సందేహాలను వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ సామర్థ్యం, భద్రతపై సందేహాలున్నాయని, ఇది అందరికీ సమస్యగా పరిణమించవచ్చని భావిస్తున్నట్టు కమలా హారిష్ వ్యాఖ్యల తర్వాత ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అమెరికా అంటువ్యాధి చికిత్సల నిపుణుడు ఆంటోనీ పౌచి స్పందిస్తూ..అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ తయారీ అసాధ్యమేమీ కాదన్నారు. అదేవిధంగా సామర్థ్యంలేని, సురక్షితం కాని వ్యాక్షిన్‌ను అమెరికా ప్రజలు వాడటానికి అనుమతులు ఉండవని చెప్పారు.

Next Story

Most Viewed