80 శాతం కెపాసిటీతో దేశీయ విమానాలు

by  |
80 శాతం కెపాసిటీతో దేశీయ విమానాలు
X

న్యూఢిల్లీ: దేశీయంగా తిరిగే (డొమెస్టిక్) విమానాలు 80 శాతం కెపాసిటీతో ప్రయాణాలు సాగించవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొవిడ్-19 కారణంగా గతేడాది ఆగస్టు నుంచి దేశీయ విమానయాన సేవలు ప్రారంభమవగా.. కొద్దికాలం అవి 70 శాతం సీట్ల సామర్థ్యంతోనే నడిచాయి. ఆ తర్వాత దానిని 80 శాతానికి పెంచారు. దేశంలో కొవిడ్ విజృంభిస్తుండటం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటిస్తుండటం.. దేశవ్యాప్తంగా కూడా ఈ తరహా ప్రకటన ఉంటుందనే ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31 దాకా దేశీయ విమానాలు 80 శాతం సీట్ల సామర్థ్యంతో నడుస్తాయని ఒక ప్రకటనలో పేర్కొంది.


Next Story

Most Viewed